Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

28-Dec-2016 10:47:48
facebook Twitter Googleplus
Photo

యువ కథానాయకుడు నారా రోహిత్ కొత్త సినిమా అప్పట్లో ఒకడుండేవాడు. ఇంకో మూడు రోజుల్లోనే ప్రేక్షకుల మందుకొచ్చేస్తోంది. ఇది 90ల నాటి నేపథ్యంలో సాగే సినిమా. అప్పట్లో జరిగిన కొన్ని నిజ జీవిత సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించాడు దర్శకుడు సాగర్ చంద్ర. ఈ నేపథ్యంలో నారా రోహిత్ మీడియాతో మాట్లాడుతూ.. 90ల్లో తన స్వీయ జీవితంలోని అనుభవాల్ని గుర్తు చేసుకున్నాడు.

??90ల నాటి రోజుల్లోకి వెళ్తే నాకు శివ సినిమా గుర్తుకొస్తుంది. ఇక 1995లో మా పెదనాన్న చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవడం మరిచిపోలేని జ్నాపకం. అప్పుడు నేను గాల్లో తేలిపోయాను. ఆయన సీఎం అయ్యాక స్కూల్లో నాపై అందరి దృష్టి పడింది. ఆ ఫీలింగ్ చాలా బాగుండేది. ఐతే తర్వాత వయసు పెరిగే కొద్దీ ఈ ఫీలింగ్ నుంచి బయటికి వచ్చేశాను??.. అని రోహిత్ అన్నాడు.

ఇక ?అప్పట్లో ఒకడుండేవాడు?. సినిమా గురించి రోహిత్ చెబుతూ ఇది ప్రేక్షకులకు విభిన్నమైన అనుభూతిని పంచే చిత్రమన్నాడు. ??సినిమాలో కొంత భాగం నక్సలిజం బ్యాక్ డ్రాప్ లో సాగుతుంది. ఇందులో పోలీస్ ఆఫీసర్.. ఓ క్రికెటర్ని అరెస్టు చేస్తాడు. అలాంటి దృశ్యాన్ని ఈ రోజుల్లో అస్సలు ఊహించలేం. 1991లో సరళీకరణ.. ఆపై ప్రపంచీకరణ తర్వాత దేశంలో పెను మార్పులు వచ్చాయి. సైకిళ్ల స్థానంలో బైకులొచ్చాయి. ఇంకా చాలా విషయాలు మారిపోయాయి. ఈ విషయాలన్నీ మా సినిమాలో ఆసక్తికరంగా చూపించాం??... అని రోహిత్ చెప్పాడు.

,  ,  ,  ,