Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

13-Jun-2017 11:31:53
facebook Twitter Googleplus
Photo

తమిళ్ హీరో కార్తీ నటించిన నా పేరు శివ సినిమా గుర్తుంది కదా ఆ సినిమాను డైరెక్ట్ చేసిన డైరెక్టర్ సుశీంతిరన్ ఒక తెలుగు సినిమాను డైరెక్ట్ చేయబోతున్నాడు. ఈ సినిమాతోనే కార్తీకి ఒక తెలుగు హీరోగా గుర్తింపు తెచ్చిపెట్టింది. సందీప్ కిషన్ హీరోగా c/o సూర్య అనే టైటిల్ తో ఒక సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ టైటిల్ ఒకేసారి సౌత్ స్టార్ హీరో సూర్య చేతులుమీదుగా విడుదల చేశారు.

నా పేరు శివ లో హీరో ఒక సాధారణ యువకుడు. అతని ఫ్యామిలి కి జరిగే అన్యాయాన్ని ఎలా ఎదుర్కొని బయటపడ్డాడు అనేది కథ. ఇప్పుడు సందీప్ c/o సూర్య కూడా అటువంటి కథతో సినిమా నిర్మిస్తున్నట్లు చెబుతున్నారు. తెలుగులో పూర్తిగా ఒక సాధారణ యువకుడులా కనిపించడానికి ఎక్కువ మంది ఇష్టపడరు. సందీప్ కొంతవరకు ఆ రిస్క్ తీసుకున్నాడు అనే చెప్పాలి. ఇకపోతే ఈ సినిమాలో హీరోయిన్ గా కృష్ణ గాడి వీర ప్రేమ గాధ ఫేమ్ మెహ్రీన్ పీర్జాదా నటిస్తుంది. తమిళ్ తెలుగు రెండు భాషలలొ ఒకే సారి విడుదల చేస్తున్నారు ఈ సినిమాను. నిన్న రిలీజైన పోస్టర్ చూస్తుంటే.. ఏదో మ్యాటర్ ఉన్నట్లే అనిపిస్తోంది కాని.. ఇప్పటికే సందీప్ కెరియర్లో మొదలై రిలీజవ్వాల్సిన సినిమాలు అనేకం ఉన్నాయి. వీటిలో ఏది ముందొస్తుందో అర్ధం కావట్లేదు.

,  ,  ,  ,  ,