Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

21-Oct-2016 11:10:27
facebook Twitter Googleplus
Photo

నారా రోహిత్.. పెద్ద పొలిటికల్ బ్యాగ్రౌండ్ నుంచి వచ్చిన వాడు. సినీ రంగం నుంచి కూడా బ్యాకప్ ఉంది అతడికి. అయినప్పటికీ తాను ఎవరినీ తనతో సినిమా చేయమని అడగనని అంటున్నాడు. నారా రోహిత్ బ్యాగ్రౌండ్ చూసి.. అతడితో సినిమా చేయడానికి చాలామంది ఫైనాన్షియర్లు ముందుకు వస్తారని.. నిర్మాతలు కూడా ఆ ధైర్యంతోనే అతడితో సినిమాలు నిర్మిస్తారని సినీ రంగంలో ఒక రూమర్ ఉంది. దీనిపై రోహిత్ స్పందించాడు.

??ఇప్పటిదాకా నేను ఏ ఒక్క నిర్మాతనూ నాతో సినిమా చేయమని అడగలేదు. భవిష్యత్తులో కూడా ఈ పని చేయను. నాతో సినిమా చేయాలని ఎవరు ముందుకొస్తే వాళ్లతో సినిమా చేస్తానంతే. ఇక ఫైనాన్షియర్ల విషయానికి వస్తే.. నేను కెరీర్లో ఎప్పుడైనా భారీ బడ్జెట్ సినిమాలు చేశానా? నా రెమ్యూనరేషన్ ఏమైనా భారీగా ఉంటుందా? నేను చాలా వరకు మీడియం.. లో బడ్జెట్ సినిమాలే చేశాను. అవి తక్కువ సమయంలో పూర్తవుతాయి. అలాంటపుడు ఫైనాన్స్ విషయంలో ఆధారపడాల్సిన అవసరం ఏముంటుంది?? అని రోహిత్ ప్రశ్నించాడు.

ఈ శుక్రవారం విడుదలవుతున్న తన సినిమా ?శంకర? మంచి థ్రిల్లర్ అని.. విడుదల ఆలస్యమైనా ఈ సినిమా తప్పకుండా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుందని రోహిత్ చెప్పాడు. తన ఫ్యూచర్ ప్రాజెక్టుల గురించి చెబుతూ.. ??నా తర్వాతి సినిమా అప్పట్లో ఒకడుండేవాడు పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. పండగా దిగివచ్చాడు కూడా పూర్తయింది. కథలో రాజకుమారి షూటింగ్ జరుపుకుంటోంది. పవన్ సాధినేని దర్శకత్వంలో చేయబోయేది హార్రర్ కామెడీ?? అని చెప్పాడు.

,  ,  ,  ,  ,