Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

05-Oct-2016 11:28:00
facebook Twitter Googleplus
Photo

నారా రోహిత్ సినిమా అంటే చాలు.. మూణ్నాలుగు నెలల్లో షూటింగ్ అయిపోతుంది. ఆర్నెల్లలో ప్రేక్షకుల ముందుకొచ్చేస్తుంది. కానీ శంకర సినిమా విషయంలో మాత్రం అలా జరగలేదు. దాదాపు నాలుగేళ్ల కిందట మొదలైన ఈ సినిమా అనివార్య కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. ఓ దశలో ఈ సినిమా అసలు రిలీజే కాదనుకున్నారు. అందరూ దాని సంగతే మరిచిపోయారు. ఇలాంటి తరుణంలో నెల కిందట ఉన్నట్లుండి వార్తల్లోకి వచ్చిందీ సినిమా. సెప్టెంబరు 16న ?శంకర?ను రిలీజ్ చేస్తున్నట్లు కూడా అనౌన్స్ చేశారు. కానీ అన్న ప్రకారం ఆ డేటుకి సినిమాను రిలీజ్ చేయలేకపోయారు.

ఐతే ఇప్పుడు మళ్లీ ?శంకర? వార్తల్లోకి వచ్చింది. ఈ సినిమాకు కొత్త రిలీజ్ డేట్ ఇచ్చారు. అక్టోబరు 21న ?శంకర?ను ప్రేక్షకుల ముందుకు తేబోతున్నట్లు నిర్మాత చంద్రమౌళి ప్రసాద్ ప్రకటించాడు. ??అక్టోబర్ 21న చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. తప్పకుండా అన్ని వర్గాల వారికీ నచ్చుతుంది. నారా రోహిత్ కెరీర్ లో మంచి సినిమాగా నిలుస్తుంది. ఇందులో కథానాయకుడికి వ్యవస్థలో ఉన్న లోటుపాట్లు నచ్చవు. వాటిని ప్రతిఘటించడానికి ప్రయత్నిస్తుంటాడు. ఆ క్రమంలో అతను ఎదుర్కొన్న అడ్డంకులు ఎలాంటివి.. వాటిని అతను ఎలా అధిగమించాడు అన్న కథాంశంతో మా సినిమా తెరకెక్కింది?? అన్నారు. ?భీమిలి కబడ్డీ జట్టు? ఫేమ్ తాతినేని సత్య దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రోహిత్ సరసన రెజీనా నటించింది. సాయికార్తీక్ సంగీత దర్శకుడు. తమిళ హిట్ మూవీ ?మౌనగురు?కు ఈ చిత్రం రీమేక్.

,  ,  ,  ,  ,  ,