Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

03-Sep-2016 11:50:13
facebook Twitter Googleplus
Photo

సినిమా ఇంటర్వెల్ సందర్భంగా రోహిత్ రచ్చ చేస్తున్నాడు. ?జనతా గ్యారేజ్? సినిమా విరామంలో రోహిత్ కొత్త సినిమా ?శంకర? ట్రైలర్ ప్రదర్శిస్తున్నారు. ఆ ట్రైలర్ జనాల్ని బాగానే ఆకట్టుకుంటోంది. రెండేళ్ల కిందటే పూర్తయి.. అనివార్య కారణాల వల్ల రిలీజ్ వాయిదా పడ్డ సినిమా శంకర. ఐతే భారీ అంచనాల మధ్య రిలీజైన ?జనతా గ్యారేజ్? సినిమా మధ్యలో ప్రదర్శిస్తుండటంతో శంకర సినిమాపై జనాల్లో ఆసక్తి పెరుగుతోంది. ట్రైలర్ కూడా ఆసక్తికరంగా ఉండటంతో జనాలు దీని గురించి చర్చించుకుంటున్నారు.

తమిళంలో సూపర్ హిట్టయిన ?మౌనగురు?కు రీమేకే ఈ ?శంకర?. తమిళంలో కరుణానిధి మనవడు అరుల్ నిధి హీరోగా నటించాడు. ఆవేశపరుడైన ఓ సాధారణ యువకుడు అనుకోకుండా ఓ క్రైంలో చిక్కుకుని.. అనేక ఇబ్బందులు ఎదుర్కోవడం.. చివరికి తన కష్టాలన్నింటినీ అధిగమించి తనను ఇబ్బంది పెట్టిన వాళ్లపై ప్రతీకారం తీర్చుకోవడం నేపథ్యంలో కథ సాగుతుంది. కథనం చాలా థ్రిల్లింగ్ గా ఉంటుంది. భీమిలి కబడ్డీ జట్టు.. ఎసెమ్మెస్ సినిమాల ఫేమ్ తాతినేని సత్య ఈ చిత్రానికి దర్శకుడు. రెజీనా కథానాయికగా నటించింది. చంద్రమౌళి ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రాన్ని సెప్టెంబరు 16న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తేనున్నారు.

,  ,  ,  ,  ,