Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

07-Jul-2016 11:46:04
facebook Twitter Googleplus
Photo

యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానులు కొద్దిరోజులుగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న రోజు రానే వచ్చింది. మిర్చి, శ్రీమంతుడు లాంటి బ్లాక్‌బస్టర్స్ అందించిన దర్శకుడు కొరటాల శివతో కలిసి ఎన్టీఆర్ చేసిన జనతా గ్యారెజ్ సినిమాకు సంబంధించిన ఫస్ట్ టీజర్ కొద్దిసేపటి క్రితమే విడుదలైంది. రంజాన్ సందర్భంగా అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపేందుకు టీమ్ విడుదల చేసిన ఈ టీజర్ సినిమాపై అంచనాలను అంతకంతకూ పెంచేసేలానే ఉందని చెప్పొచ్చు.
దర్శకుడు కొరటాల శివ ఎప్పట్లానే తన బలమైన కథాంశాన్ని, అంతే బలమైన సంభాషణలతో ఓ కథగా చెప్పినట్లు టీజర్ చూస్తే స్పష్టంగా అర్థమవుతుంది. బలవంతుడు బలహీనుడ్ని భయపెట్టి బతకడం ఆనవాయితీ.. బట్ ఫర్ ఏ చేంజ్, ఆ బలహీనుడి వద్ద కూడా ఓ బలముంది. జనతా గ్యారెజ్.. ఇచట అన్నీ రిపేర్ చేయబడును అన్న డైలాగ్‌ను 35 సెకండ్ల టీజర్‌లో తెలివిగా చెప్పుకొచ్చిన స్టైల్ బాగుంది. ఇక ఈ టీజర్‌లో ఎన్టీఆర్ అదిరిపోయే లుక్స్, తిరు విజువల్స్, దేవిశ్రీ మ్యూజిక్ హైలైట్స్‌గా నిలిచాయి. అంతా అనుకున్నట్లుగానే జనతా గ్యారెజ్ టీజర్ అంచనాలను అందుకున్నదనే నిస్సందేహంగా చెప్పొచ్చు. ఎన్టీఆర్ సరసన సమంత, నిత్యా మీనన్‌లు హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాలో మళయాల సూపర్ స్టార్ మోహన్ లాల్ ఓ ప్రధాన పాత్రలో నటించారు.

,  ,  ,  ,  ,