Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

16-May-2015 11:31:11
facebook Twitter Googleplus
Photo

మెగా అభిమానులంతా ఇప్పుడు చిరంజీవి సినిమాకి సంబంధించిన విశేషాలను ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ సినిమా దర్శకుడు, టైటిల్... మొదలైనవాటి విషయంలో వాళ్లకి ఒక క్లారిటీ వచ్చేసింది. ఇక వాళ్ల ఆలోచనల్లా ఈ సినిమాలో కథానాయిక ఎవరు అనేదే. చిరూ సినిమాకి సంబంధించిన విషయం బయటికి వచ్చిన తక్కువ సమయంలోనే, ఇందులో కథానాయికగా నయనతారని ఎంపిక చేశారనే వార్త షికారు చేసింది. నయనతార సీనియర్ కథానాయిక కావడం వలన ఈ వార్త నిజమయ్యుండొచ్చని అనుకున్నారు.
అయితే దర్శకుడు పూరీ జగన్నాథ్ సన్నిహితులు మాత్రం ఇందులో నిజం లేదని చెబుతున్నారు. అసలు ఈ సినిమా విషయంగా నయనతారను సంప్రదించడం జరగలేదని అంటున్నారు. దాంతో ఆడియన్స్ ఆసక్తి మరింత ఎక్కువ అయింది. ఈ సినిమాలో చిరంజీవి రెండు పాత్రలను ధరించనున్న విషయం తెలిసిందే. ఈ రెండు పాత్రల సరసన కనిపించే కథానాయిక ఎవరనేదాని గురించే ఫిల్మ్ నగర్లో చర్చలు జరుగుతున్నాయి. ఆ చర్చల్లో కొంతమంది కథానాయికల పేర్లు వినిపిస్తున్నాయి. మరి వాళ్లలో ఈ అవకాశం ఎవరిని వరిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.

,  ,  ,  ,  ,  ,