Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

03-Apr-2016 14:50:23
facebook Twitter Googleplus
Photo

మనం, సోగ్గాడే చిన్ని నాయనా లాంటి రెండు వరుస విజయాల తర్వాత నాగార్జున ఊపిరి సినిమాతో వచ్చి హ్యాట్రిక్ కొట్టిన విషయం తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ టాక్‌తో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ వర్షం కురిపిస్తోంది. ఇక నాగార్జున గత రెండు చిత్రాల్లానే ఊపిరి కూడా యూఎస్‌లో మంచి కలెక్షన్స్ సాధించడం విశేషంగా చెప్పుకోవచ్చు. అతి తక్కువ సమయంలో యూఎస్‌లో ఒక మిలియన్ మార్క్ సాధించిన ఈ సినిమా తరువాత కూడా నిలకడగా కలెక్షన్స్ రాబడుతూ యూ యస్ బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తున్నది. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికి దాదాపు 25 కోట్లు పైనే ఊపిరి సినిమా సాధించింది. సర్దార్ గబ్బర్ సింగ్ వచ్చేంతవరకూ మరో పెద్ద సినిమా లేకపోవడం తో సినిమాకి కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశం ఉంది.
నాగార్జున-కార్తీ-తమన్నా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఎమోషనల్ కామెడీ డ్రామాగా అందరి మన్ననలూ అందుకుంది. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను పీవీపీ సంస్థ తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో నిర్మించింది.

,  ,  ,  ,  ,  ,