Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

23-Aug-2016 14:17:38
facebook Twitter Googleplus
Photo

సినిమాలలో అందాల ఆరబోత చేస్తూ భారీ రెమ్యూనరేషన్ తీసుకునే ముద్దుగుమ్మలు సినిమా ప్రమోషన్స్ లలోను అలాగే అదరగొడతారు, కానీ క్రేజ్ హీరోయిన్ నయనతార మాత్రం దీనికి వ్యతిరేకం. ఇప్పుడే కాదు ఆమె మొదటినుండి కూడా సినిమా కు సంబంధించిన ఎటువంటి ప్రమోషన్ కు హాజరుకానని ముందుగానే దర్శక, నిర్మాతలతో మాట్లాడుకుంటుందట. వాళ్ళు ఒకే అంటేనే ఆ సినిమా చేయడానికి సైన్ పెడుతుందట.

కోట్లకు కోట్లు రెమ్యూనరేషన్ తీసుకునే నయన్ , అసలు ప్రమోషన్స్ కు ఎందుకు రాదు అనే చర్చ ఈ మధ్య సోషల్ మీడియా లో హల్చల్ చేసాయి. ఎవరికీ వారు నయన్ తీరు ఫై మండిపడ్డారు. ఎవరి కామెంట్స్ ఎలా ఉన్న నయనతార మాత్రం అంత పట్టులా ఉండానికి కారణం లేకపోలేదు. తాను నటించిన సినిమా ప్రమోషన్ కు వస్తే అది తప్పకుండా నిరాశనే మిగిలిస్తుందని ఆమె సెంటిమెంట్ అట. అందుకే ఆమె ప్రమోషన్ కు దూరంగా ఉంటుందని ఆమె సన్నిహితులు చెపుతున్నారు. కానీ మరికొంతమంది మాత్రం ఆమె అటెండ్ అయినా సినిమాలు హిట్ కాలేదా అంటూ కొన్ని సినిమాల పేర్లు చెపుతున్నారు. నిర్మాతలు పదే పదే ఆమె వెంట పడకుండా ఉండడానికే నయన్ ఇలా కబుర్లు చెప్పి తప్పించుకుంటుందని కామెంట్స్ చేస్తున్నారు.

,  ,  ,  ,  ,  ,  ,