Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

05-May-2016 14:39:50
facebook Twitter Googleplus
Photo

తెలుగు సినిమా చరిత్రలో చాలామంది దర్శకులు మొదటి సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నా రెండవ సినిమా విషయంలో చాలా మంది ఫెయిల్ అయ్యారు. ఉదాహరణకి మొదటి సినిమాతో సూపర్ హిట్ కొట్టి రెండవ సినిమాలో దారుణమైన పరాజయం చెందిన వారిలో కరుణాకరన్, తేజ, పూరి జగన్నాధ్, వినాయక్, దశరధ్, సుకుమార్, సురేందర్ రెడ్డి, క్రిష్, సంతోష్ శ్రీనివాస్, నందిని రెడ్డి, ప్రవీణ్ సత్తారు, సుధీర్ వర్మ, ప్రభాకర్ రెడ్డి మొదలైన వారిని చెప్పుకోవచ్చు. కానీ రెండవ సినిమాకూడా హిట్ కొట్టి రాజమౌళి, శ్రీకాంత్ అడ్డాల, కొరటాల శివ, మేర్లపాక గాంధీ మాత్రం ద్వితీయ విఘ్నం దాటేసారు.
ఇంతకు ముందు కళ్యాణ్ రామ్ తో ?పటాస్? లాంటి సూపర్ హిట్ సినిమా తీసిన అనిల్ రావిపూడి రెండో సినిమా ?సుప్రీమ్? నేడు విడుదలైంది. సాయిధరమ్ తేజ్ హీరోగా నటించిన ఈ సినిమా మాకు లభించిన సమాచారం ప్రకారం కొత్తగా లేకపోయినా ఎక్కడా విసిగించకుండా సాధారణ ప్రేక్షకులకు నచ్చేలా సినిమాని దర్శకుడు తీర్చిదిద్దినట్లు తెలిసింది. ముఖ్యంగా రాశిఖన్నా, సాయిధరమ్ తేజ మధ్య వచ్చే సన్నివేశాలు బాగా పండటంతో క్లైమాక్స్ రొటీన్ గా ఉన్నప్పటికీ సినిమాని పక్కా మాస్ ఎంటర్టైనర్ గా తీర్చిదిద్దడంలో దర్శకుడు అనిల్ రావిపూడి విజయం సాధించాడని టాక్ వినిపిస్తున్నది. కాబట్టి సుప్రీమ్ సినిమా హిట్ టాక్ తో అనిల్ రావిపూడి తన ద్వితీయ విఘ్నం దాటినట్టేనని విశ్లేషకులు అంటున్నారు. సాయి ధరమ్ తేజ్, రాశి ఖన్నా హీరో హీరోయిన్లు గా నటించిన ఈ సినిమాను ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించారు.

,  ,  ,  ,  ,