మినిమమ్ గ్యారెంటీ హీరో అనిపించుకున్నాడు అల్లరి నరేష్. అయితే ఇది గతం. ?సుడిగాడు? తర్వాత మళ్ళీ హిట్ ముఖం చూడలేదు. వరుసగా ఫ్లాపులు మూట కట్టుకుంటున్నాడు. తాజాగా ?సెల్ఫీరాజా? కూడా నరేష్‌ని నిరాశ పరిచింది. నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చినీ సినిమా నెగిటివ్ టాక్ ను మూటకట్టుకుంది. చాలా అవుట్‌డేటెడ్ సన్నివేశాలతో ప్రేక్షకులను విసుగు తెప్పించాడు నరేష్. కథల ఎంపికలో నరేష్ చేస్తున్న తప్పుల్ని ఈ సినిమా మరోసారి బహిర్గత పరిచింది. నరేష్ కెరీర్ లో 50వ సినిమా ఇది. కనీసం మార్క్ కోసమైనా వినూత్నమైన వినోదం ప్రయత్నించాల్సిది. కానీ అదే రోడ్డకొట్టుడు కామెడీ ట్రై చేసి మరోసారి ఫైయిలయ్యాడు నరేష్.
Negative, Talk, SelfieRaja, Matter, Tollywood,