Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

13-Oct-2015 17:59:26
facebook Twitter Googleplus
Photo

మహ మహ .. అంటూ కుర్రకారుపై మత్తు చల్లింది మంత్ర ఛార్మి. ఆ సినిమా రిలీజై ఇప్పటికే చాలా కాలమే అయ్యింది. ఇంకా మంత్ర ఛార్మిగానే గుర్తుండిపోయింది. అయితే ఆ తర్వాత ఆ స్థాయిలో మత్తు చల్లి చిత్తు చేయడంలో తడబడింది అమ్మడు. ప్రేమ ఒక మైకం - మంత్ర 2 - మంగళ - జ్యోతిలక్ష్మి .. ఇలాంటి సినిమాలెన్నో చేసినా మంత్ర రేంజు ఎఫెక్ట్ ఇవ్వలేకపోయింది. అయితే సినిమాల పరంగా సరైన విజయాల్లేకపోయినా జనాల్లో ఈ అమ్మడికి ఉన్న క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ప్రస్తుతం ఈ భామ రామ్ గోపాల్ వర్మ అండ్ శిష్య బృందంతో అంటకాగుతోంది. పూరి - కృష్ణవంశీ కాంపౌండ్ నుంచి బోలెడన్ని అవకాశాలు అందుకుంటోంది.

ఇటీవలే ఈ అమ్మడికి ఓ వింత అనుభవం. తన కార్ లో హైదరాబాద్ నగరంలో వెళుతూ ఓ ట్రాఫిక్ జంక్షన్ లో ఆగింది ఛార్మి. ఎలా కనిపెట్టిందో ఓ చిన్నారి ఛార్మిని చూసి పరేషాన్ అయిపోయింది. వెంటనే అంత ట్రాఫిక్ లోనూ తన అభిమాన తార దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చింది. తనతో ఓ సెల్ఫీ కూడా దిగేసింది. ఇదంతా చూస్తున్నవారికి ఒకటే ఛోద్యం. ఛార్మికి వీరాభిమానులున్నారు. తను ఎక్కడికి వెళ్లినా వెంటపడేవాళ్లున్నారన్న సంగతిని ఈ సంఘటన చెబుతోంది. ఇటీవలి కాలంలో సెలబ్రిటీల కార్లకు అయినా బ్లాక్ గ్లాసెస్ ఉంటే పోలీస్ రూల్ ఒప్పుకోవడం లేదు. పూర్తిగా ట్రాన్స్పరెంట్ గ్లాసెస్ తోనే ఉండాలి. అందుకే ఛార్మి ఆ కార్ లో ఉన్నట్టు తెలిసిపోయిందన్నమాట!

,  ,  ,