Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

13-Jul-2016 14:49:25
facebook Twitter Googleplus
Photo

హైదరాబాద్:మెగా బ్రదర్ నాగబాబు కుమార్తె ..నీహారిక కొణిదల పెద్ద తెర ఎంట్రీ రీసెంట్ గానే జరిగిన సంగతి తెలిసిందే. రామరాజు దర్శకత్వంలో మధుర శ్రీధర్ నిర్మించిన ఒక మనసు చిత్రంతో ఆమె వెండితెరకెక్కింది. అయితే ఆ సినిమా ఊహించిన మేరకు కిక్ ఇవ్వలేకపోయింది. మెచ్యూర్డ్ లవ్ స్టోరీగా చెప్పబడుతున్న ఆ చిత్రం మార్నింగ్ షో నుంచే డివైడ్ టాక్ ని మూట కట్టుకుంది. దానికి తోడు ఆమెలోని ఉషారుని అంతా చంపేసే పాత్రలో దర్శకుడు బాగా డల్ గా చూపించాడు. చీర కట్టించి మరీ ఆమెను ఓ మెచ్యూర్డ్ లేడీగా కనిపించేలా చేసాడు. దాంతో ఆమెకు రావాల్సిన మైలేజీ రాలేదు. ఎంతో ఆసపెట్టుకుని వెళ్లిన మెగాభిమానులు నిరాశపడిపోయారు. ఈ నేపధ్యంలో ఆమె తన రెండో చిత్రం అయినా ఆచి,తూచి అడుగు వేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.
ఈ సారి గ్లామర్ రోల్ కాకపోయినా ఆకర్షియంగా ఉంటే నటనకు ప్రయారిటీ ఇచ్చే పాత్రతో కనిపించాలని నిర్ణయించుకుందని సమాచారం. ఈ మేరకు ఆమె కథలు వింటోందని సమాచారం. అయితే ఈలోగా.. మ‌రో మూవీలో న‌టించే ముందు బుల్లి తెర‌పై ద‌ర్శ‌న‌మివ్వాల‌ని నిహారిక నిర్ణ‌యించుకుంది నిహారికకు ఎంతో పేరు తీసుకొచ్చిన ముద్ద‌ప‌ప్పు అవ‌కాయ్ లో న‌టించేందుకు ఓటు వేసిందనిసమాచారం.. ఈ వెబ్ సీరియ‌ల్ ద‌ర్శ‌కుడు ప్ర‌వీణ్ స్క్రిప్ట్ రూపొందించే ప‌నిలో ప‌డ్డాడు.. త్వ‌ర‌లోనే షూటింగ్ ప్రారంభ‌మ‌వుతుందని తెలుస్తోంది.

,  ,  ,  ,  ,