Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

10-Aug-2016 11:33:43
facebook Twitter Googleplus
Photo

ఒక మ‌న‌సు సినిమాతో మెగా ఫ్యాన్స్‌ని బాగా నిరాశ ప‌రిచింది మెగా బ్రదర్ నాగబాబు తనయ నిహారిక‌. ఈ సినిమాతో నిహారిక స్టార్ హీరోయిన్ల‌కు చ‌మ‌ట‌లు ప‌ట్టిస్తుంద‌నుకొంటే సీన్ రివ‌ర్స్ అయ్యింది. రెండో సినిమా విష‌యంలోనే ఆచితూచి అడుగు వేయాల్సిన పరిస్థతి ఏర్ప‌డింది. చాలా డిస్కషన్స్ తర్వాత కార్తిక్ అనే డెబ్యూ డైరెక్టర్ చెప్పిన కధకు ఓకే చెప్పింది నిహారిక.

అయితే ఈ సినిమాకి హీరో దొరకడం లేదని వార్తలు వచ్చాయి. చాలా మంది యువ హీరోలు ఈ స్క్రిప్ట్ కు నో చెప్పారని ఫిల్మ్ నగర్ సర్కిల్స్ లో వినిపించింది. అయితే ఎట్టకేలకు నిహారిక కు హీరో సెట్ అయ్యాడు. పెళ్లి చూపులతో మంచి జోరుమీదున్న ఫేమ్ విజయ్ దేవరకొండ ఈ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట.

కామెడీ ప్లస్ లవ్ డ్రామా బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా వుండబోతుందని తెలుస్తోంది. ?ఒకమనసు? విపరీతమైన డల్ గా సాగింది. ఈ మెలో డ్రామాని భరించలేకపోయారు ప్రేక్షకులు. ఇప్పుడీ సినిమా విషయంలో చాలా కేర్ తీసుకుంటున్నారట. ట్రెండ్ కు తగ్గట్టే యమా హుషారుగా వుండేలా స్క్రిప్ట్ ని డిజైన్ చేశారట. ఇప్పుడు హీరో కూడా ఓకే అయ్యాడు కాబట్టి ఇక సెట్స్ పైకి వెళ్ళిపోవడమే.

,  ,  ,  ,  ,  ,