Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

06-Feb-2015 12:00:36
facebook Twitter Googleplus
Photo

మహేష్ బాబు కోసం ప్రముఖ రచయిత వక్కంతం వంశీ ప్రస్తుతం ఓ కథను తయారుచేస్తున్నాడు. దర్శకుడు పూరీ జగన్నాథ్ ఆయనకు ఈ పనిని అప్పజెప్పాడట. ప్రస్తుతం ఎన్టీఆర్ హీరోగా పూరీ 'టెంపర్' చిత్రాన్ని చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. దీనికి వక్కంతం స్క్రిప్టు సమకూర్చాడు. ఒక విధంగా చెప్పాలంటే, తన కెరీర్లోనే తొలిసారిగా పూరీ ఇతర రచయిత నుంచి కథ తీసుకున్న వైనం ఈ సినిమా విషయంలోనే జరిగింది. ఈ రచయిత పనితనానికి ఇంప్రెస్ అయిన పూరీ, త్వరలో తాను మహేష్ తో చేయనున్న చిత్రానికి కూడా కథను రూపొందించే పనిని ఈ రచయితకే అప్పజెప్పాడు. ప్రస్తుతం వక్కంతం అదే పనిలో ఉన్నాడట!

,  ,  ,  ,  ,