Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

04-Jun-2016 13:13:03
facebook Twitter Googleplus
Photo

మెగా బ్రదర్ నాగేంద్ర బాబు కూతురు నీహారిక 'ఒక మనసు' చిత్రంతో హీరోయిన్ గా పరిచయం అవుతోంది. మెగా ఫ్యామిలీ నుంచి వస్తున్న తొలి హీరోయిన్ గా రికార్డు సృష్టించబోతోంది. ఒక్క మెగా ఫ్యామిలీ అనే కాదు.. మొత్తం టాలీవుడ్ లోనే చాలాకాలం తర్వాత ఒక వారసురాలు హీరోయిన్ అవుతోంది. ఇందుకు మెగా ఫ్యామిలీ మొత్తం అంగీకరించడం వెనుక జరిగిన చాలా కథను ఇప్పటికే చాలాసార్లు చెప్పేసుకున్నాం.

అన్నీ ఫైనల్ అయ్యాక.. 'ఒక మనసు'కే నీహారిక ఎందుకు ఓటేసింది? అనే విషయం కూడా తెలియాలి. ఏ తరహా సినిమా చేయాలి? ఏ స్టోరీని యాక్సెప్ట్ చేయాలి? ఏ జోనర్ అయితే మెగా ఫ్యాన్స్ నుంచి అబ్జెక్షన్స్ రాకుండా ఉంటాయి? ఏ కాన్సెప్ట్ అయితే.. హీరోయిన్ గా నిలబడచ్చు? ఇలాంటి వాటిపై చాలానే ఆలోచించారట. అందుకోసం మొత్తం తొమ్మిదికి పైగా కథలు విన్నారట నీహారిక అండ్ టీం.

దాదాపు అన్నీ యంగ్ హీరోలతో సినిమాలే అయినా.. కుర్ర డైరెక్టర్లు చాలా మంచి ఆలోచనలతో వచ్చారని చెబుతోంది నీహారిక. అయితే.. చివరకు ఒక మనసు స్టోరీలో.. లవ్ స్టోరీ ఫ్రెష్ గా ఉండడం.. తన కేరక్టర్ ను తీర్చిదిద్దిన విధానం చాలా బాగుండడంతో.. ఈ సినిమాను ఒప్పుకున్నా అంటోంది నీహారిక. ఇప్పటికే రొమాంటిక్ లవ్ స్టోరీ గా రూపొందిన ఈ చిత్రం టీజర్ - ట్రైలర్ కు ఇప్పటికే బోలెడంత పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. సినిమాపై కూడా అంచనాలు కూడా బాగానే ఉండడం విశేషం.

,  ,  ,  ,  ,  ,