Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

03-Nov-2017 13:47:49
facebook Twitter Googleplus
Photo

ఇండస్ట్రీలో బిజినెస్ చేయాలంటే నమ్మకాలతో కూడుకున్న పని. ఆలోచన ఇక్కడ అసలు కీ రోల్. పెట్టిన ప్రతి పైసా మళ్లీ వస్తుందా రాదా అన్నది అనుమానమే. ఎక్కువగా ఇక్కడ లాభం రాకపోయినా పర్వాలేదు గాని నష్టాలు రాకుండా ఉంటే చాలు అనుకుంటారు. కొన్ని సినిమాల అదృష్టం ఏమిటో గాని సినిమా పట్టాలెక్కకముందే బేరాలు మొదలవుతాయి. ఒక్కోసారి చేసే ప్రమోషన్ కూడా సినిమాపై అంచనాలు పెంచితే వెంటనే భారీగా కొనడానికి కొందరు ముందుకు వస్తారు.

ఇప్పుడు నిఖిల్ తీయబోయే సినిమాకి కూడా అదే స్థాయిలో ఒక మంచి ఆఫర్ దక్కించుకొంది. త్వరలో తమిళ్ కణితన్ సినిమాను తెలుగులో రీమేక్ చేయబోతోన్నాడు. స్పైడర్ సహా నిర్మాత ఠాగూర్ మధు ఈ సినిమాను నిర్మించడానికి ఎపుడో సైన్ చేశాడు. అయితే స్పైడర్ డిజాస్టర్ అవ్వడంతో ఆయన కొంచెం డల్ అయ్యారట. అయితే ఆయన అదృష్టం బావుండి సినిమా స్టార్ట్ అవ్వకుముందే కొందరు ప్రముఖులు సినిమాను భారీ మొత్తంలో కొనడానికి మంచి ఆఫర్ ని ఇచ్చారట.

అసలైతే మధు సినిమాను 7 కోట్లలో ఫినిష్ చేద్దామని టార్గెట్ పెట్టుకున్నాడట. కానీ సినిమాకు ఇప్పుడు 11 కోట్ల వరకు బేరం కుదిరందని తెలుస్తోంది. అంటే నిర్మాత ఇప్పుడు ఆ మొత్తాన్ని తీసుకొని కేవలం 7 కోట్లకు నిర్మించి మిగతా నాలుగు కోట్లు వెనకేసుకోవాలి. సినిమా రిలీజ్ తర్వాత వచ్చే లాభాలన్ని మొత్తంగా హక్కుల్ని కొన్నవారికే అందుతాయి. నిజంగా ఈ ఆఫర్ చాలా బెస్ట్ అని చెప్పాలి.

,  ,  ,  ,  ,  ,