Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

23-Nov-2015 17:55:58
facebook Twitter Googleplus
Photo

స్టార్ హీరోల సినిమాల్లో ఒక్క హీరోయిన్ ఉంటే ఆనదు. అందుకే కనీసం ఇద్దరైనా ఉండేలా చూసుకుంటారు. కుదిరితే ముగ్గురు హీరోయిన్లను కూడా పెట్టడానికి వెనకాడరు. కానీ చిన్న హీరోల సినిమాల్లో ఇద్దరు హీరోయిన్లుండటమే కష్టం. యువ కథానాయకుడు ఇప్పటిదాకా దాదాపుగా సింగిల్ హీరోయిన్లతోనే నెట్టుకొచ్చాడు. ఐతే ఒక హీరోయిన్ అయ్యాక తర్వాతి స్టేజ్ లో ఇద్దరు హీరోయిన్లతో రొమాన్స్ చేయాలి కానీ.. అతనేమో ఒకేసారి ముగ్గురు హీరోయిన్లతో ఆడి పాడటానికి రెడీ అయిపోతున్నాడు. ?టైగర్? ఫేమ్ వీఐ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమాలో నిఖిల్ సరసన ముగ్గురు హీరోయిన్లుంటారట.

ఇప్పటికే ఇందులో తాప్సి - అవికా గోర్ హీరోయిన్లుగా ఫిక్సయ్యారు. వీళ్లతో సినిమాలో ఇంకో హీరోయిన్ కు కూడా చోటుందట. ఆ పాత్రను స్వాతి రెడ్డి లేదా ఇంకో అమ్మాయితో చేయించడానికి ట్రై చేస్తున్నారు. స్వామి రారా సినిమాలో నిఖిల్ - స్వాతి జంటగా నటించిన సంగతి తెలిసిందే. అప్పటికి ఇద్దరికీ జోడీ బాగానే కుదిరింది కానీ.. ఈ మధ్య స్వాతి షేప్ ఔట్ అయిపోయి నిఖిల్ కన్నా పెద్దమ్మాయిలా కనిపిస్తోంది. మరి ఆమెనే ఎంచుకుంటారా ఇంకొకరిని ట్రై చేస్తారా చూడాలి. నిఖిల్ కొత్త సినిమా ?శంకరాభరణం? డిసెంబరు 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నెల్లోనే వీఐ ఆనంద్ తో సినిమా మొదలు పెట్టబోతున్నాడు నిఖిల్.

,  ,  ,