Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

29-Jun-2017 13:24:39
facebook Twitter Googleplus
Photo

శుక్రవారం వచ్చింది అంటే ఈసారి ఎవరు భరిలోకి దిగుతారో అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తారు. పెద్ద స్టార్స్ సినిమాలు లేకపోయినా ప్రతి నెలా ఏదో ఒక స్టార్ సినిమా వచ్చి సినీ అభిమానులను పలకరిస్తుంది. ఈ సారి బాక్స్ ఆఫీసు వద్ద పోటీ కొంచం కొత్తగా అనిపిస్తుంది. ఇద్దరు ఒకే లాంటి ఒకే స్థాయి హీరోలు మధ్య కాకుండా ఒక యంగ్ టాలెంటెడ్ హీరో సినిమా మరో పాత కమర్షియల్ హీరోయిన్ మధ్య పోటీ ఏర్పడింది.

నేచురల్ హీరోగా పేరు తెచ్చుకున్న నాని వరస హిట్ సినిమాలుతో భలే భలే జోష్ లో ఉన్నాడు. అదే స్పీడ్ లో ఇప్పుడు నేను లోకల్ తరవాత వస్తున్న సినిమా 'నిన్ను కోరి' జూలై 7న విడుదల అవుతుంది. ఇప్పటికే యూట్యూబ్ లో పాటలుకు మంచి క్రేజ్ ఏర్పడింది. థియేట్రికల్ ట్రైలర్ ను కూడా 5 మిలియన్ మంది వీక్షించారు. దీనితో నాని నిన్నుకోరి సినిమా పై అంచనాలు పెరిగాయి అనే చెప్పవచ్చు. ఇప్పుడు అదే రోజు శ్రీదేవి నటించిన హింది సినిమా మామ్ తెలుగు డబ్బింగ్ వర్షన్ వస్తోంది. చాల కాలం తరువాత తెలుగులోకి వచ్చి ప్రమోషన్లు చేస్తున్న శ్రీదేవి మామ్ సినిమా పై బోలెడు ఆశలు పెట్టుకుంది. కాకపోతే నానికి ఉన్న ఫాలోయింగ్ శ్రీదేవి సినిమా పై ప్రభావం చూపుతుంది అని అంటున్నారు ట్రేడ్ వర్గాలు. నిన్ను కోరి సినిమా ఇప్పటికే యూత్ లో మంచి ఆశక్తిని రేపింది. ఇలాంటప్పుడు శ్రీదేవి నటించిన సీరియస్ మూవీ మామ్ ఎలా పోటీలో నిలబడుతుంది అనేదే డౌట్.

ఆది పినిశెట్టి కూడా నిన్ను కోరి సినిమాలో ఒక ముఖ్యపాత్రలో కనపడనున్నాడు. నివేథ థామస్ హీరోయిన్ గా నటిస్తుంది. నాని స్టైల్ కామిడీ తో చిలిపి ప్రేమ తో నిన్ను కోరి వస్తుంటే అమ్మ ప్రేమ గొప్పతనాన్ని చెబుతూ శ్రీదేవి ఒక థ్రిల్లర్ మూవీ మామ్ తో వస్తుంది

,  ,  ,  ,  ,