Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

21-Jul-2017 14:03:37
facebook Twitter Googleplus
Photo

లేటెస్ట్ హిట్ మూవీ నిన్ను కోరి. ఇప్పటికే ఈ చిత్రం సూపర్ హిట్ స్టేజ్ ను దాటేస్తోంది. నాని కెరీర్ బెస్ట్ మూవీస్ లో ఒకటిగా నిలుస్తోంది. అర్బన్ ఆడియన్స్ కు తప్ప రూరల్ ప్రేక్షకులకు ఎక్కదేమో అని నాని స్వయంగా అనుమానించిన ఈ క్లాస్ మూవీని.. తెలుగు ప్రేక్షకుల్లో అన్ని వర్గాల వారు ఆదరించేశారు. నిన్ను కోరి విషయంలో యూనిట్ ఎక్స్ పెక్ట్ చేసినదానికంటే పెద్ద సక్సెస్ అయిందంటారు ఇండస్ట్రీ జనాలు.

నిన్ను కోరి సక్సెస్ మీట్ ను రీసెంట్ గా విజయవాడలో నిర్వహించింది యూనిట్. ఇది ప్రేక్షకుల కోసం అయితే.. ఇప్పుడు వారు తమ కోసం ఓ సక్సెస్ పార్టీని సెలబ్రేట్ చేసుకోబోతున్నారట. ఇందుకోసం అందరూ కలిసి గోవా టూర్ ప్లాన్ చేసుకున్నట్లు తెలుస్తోంది. హీరో నాని.. ఆది పినిశెట్టి.. రైటర్ కోన వెంకట్.. దర్శకుడు శివ నిర్వాణ.. ఇలా అందరూ కలిసి గోవా వెళ్తున్నారట. ప్రస్తుతం వేణు శ్రీరాం దర్శకత్వంలో మిడిల్ క్లాస్ అబ్బాయి-ఎంసీఏ సినిమా చేస్తున్న నాని.. ఆ షూటింగ్ కు బ్రేక్ ఇచ్చేశాడట కూడా.

రొమాంటిక్ కామెడీ జోనర్ లో తెరకెక్కిన నిన్ను కోరి సాధించిన అద్భుతమైన సక్సెస్.. నానికి బాగా కిక్ ఇచ్చిందని అంటున్నారు. నిర్మాత డీవీవీ దానయ్య.. సహ నిర్మాత కోన వెంకట్ కూడా ఫుల్లు హ్యాపీగా ఉన్నారట. అందుకే ఈ గోవా పార్టీ అరేంజ్ చేశారని.. ఆదివారం వరకూ వీరంతా గోవాలోనే గడపనున్నారని తెలుస్తోంది.

,  ,  ,  ,  ,  ,