Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

27-Aug-2016 13:08:44
facebook Twitter Googleplus
Photo

రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య రజనీకాంత్ ఒక స్టార్ హీరో కూతురిగా కాకుండా స్వశక్తితో ఎదగాలని ప్రయత్నిస్తుంటారు. ఆ ప్రయత్నంలోనే ఆమె దర్శకురాలిగా మారి భర్త, హీరో ధనుష్ తో ?3? అనే చిత్రాన్ని కూడా తెరకెక్కించి పలు ప్రసంశలు అందుకోవడమే గాక తాజాగా ఓ అరుదైన గుర్తింపును కూడా దక్కించుకుంది.
సౌత్ ఇండియా తరపున యునైటెడ్ నేషన్స్ ఉమెన్స్ గుడ్ విల్ కు బ్రాండ్ అంబాసిడర్ గా ఎంపికైంది ఐశ్వర్య. సినిమాలతో పాటు సమాజ సేవ, మహిళా సాధికారత వంటి అంశాలపై ఎక్కువగా పనిచేయడం వల్ల ఆమెకు ఈ గౌరవం దక్కింది. ఈ పదవిలో ఆమె ఆసియాలో ఉన్న మహిళల అభివృద్ధి కోసం పనిచేస్తారు. గతంలో ఈ గౌరవాన్ని బాలీవుడ్ నటి కాజోల్ దక్కించుకుంది.

,  ,  ,  ,  ,  ,