Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

22-Oct-2016 13:23:10
facebook Twitter Googleplus
Photo

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో సూపర్ స్టార్ మహేష్ బాబును టీజ్ చేసిన తెలుగు పిల్ల తేజస్వి మదివాడ.. ఆ తరువాత ఐస్ క్రీమ్ రుచులు చూపించింది.. కేరింతలు కొట్టించింది. కాని వర్కవుట్ కాలేదు. ఆ సినిమాలో నాక్కొంచెం క్యాస్ట్ ఫీలింగ్ ఎక్కువ అంటూ మహేష్ తో టీజింగ్ చేసిన ఆ బ్యూటి.. ఇప్పుడు చిన్నోడు సినిమాలో చిన్నపాత్రల్లో కాకుండా.. పెద్దోడు సరసన హీరోయిన్ పాత్రను పట్టేసింది.

ప్రస్తుతం బాలీవుడ్ మూవీ సాలా ఖద్దూస్ కి తెలుగు రీమేక్ గా గురు చిత్రంతో బిజీగా ఉన్న వెంకటేష్.. త్వరలో మరో మూవీలో కూడా నటించనున్నాడు. నిత్యా మీనన్ తో కలిసి రొమాంటిక్ కామెడీ చేయనున్నాడు వెంకీ. అయితే ఈ సినిమాలో తేజస్వి ని కూడా తీసుకున్నాడట దర్శకుడు కిషోర్ తిరుమల. వెంకీ-నిత్యాల సినిమాలో తాను నటిస్తున్నట్లు కన్ఫాం చేసింది తేజస్వి. 'నేను ఓ రెబల్ మాదిరిగా బిహేవ్ చేసే టీనేజర్ పాత్రలో కనిపిస్తాను. తను అనుకున్నది చేసేయడమే తప్ప వేరే ఏదీ పట్టించుకోని రోల్ ఇది. వచ్చే నెల నుంచి షూటింగ్ లో పాల్గొనబోతున్నా' అని చెప్పింది.

ఆడాళ్లూ మీకు జోహార్లు అనే టైటిల్ పై రూపొందుతున్న మూవీలో తన కంటే వయసులో చాలా చిన్నదైన అమ్మాయిని చేసుకోవాల్సి వచ్చే వ్యక్తిగా వెంకటేష్ నటించనున్నాడు. 'వెంకటేష్ సార్ కేరక్టర్ జీవితంలో నలుగురు అమ్మాయిలతో ఉంటారు. వారిలో ఒకరిగా నేను నటిస్తున్నా. లీడ్ రోల్ కాదు కానీ.. సినిమాకి చాలా ఇంపార్టెంట్. స్క్రీన్ స్పేస్ కూడా ఎక్కువగానే ఉంటుంది' అని చెబుతోంది తేజస్వి. చాలా కాలం తర్వాత ఈ భామకి పెద్ద సినిమాలో ఇంపార్టెంట్ రోల్ రావడంతో.. తెగ హ్యాపీగా ఉంది.

,  ,  ,  ,  ,  ,