Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

11-Oct-2017 12:25:06
facebook Twitter Googleplus
Photo

బాలీవుడ్ లో గుర్తింపు తెచ్చుకుంది శ్రద్ధ కపూర్. తర్వాత వరస హిట్లతో తొందరలోనే స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. బాహుబలి ఘనవిజయం తర్వాత ప్రభాస్ నటిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ సాహోలో హీరోయిన్ గా ఎంపికవడంతో మొదటిసారి టాలీవుడ్ లో అడుగు పెడుతోంది. ఈ రోల్ కు పలువురు బాలీవుడ్ భామల పేర్లు పరిశీలనకు వచ్చినా చివరకు శ్రద్ధ ఆ అవకాశాన్ని కొట్టేసింది.

సాహో సినిమా షూటింగ్ ప్రస్తుతం జోరుగా సాగుతోంది. అన్నపూర్ణ స్టూడియోలో ఓ భారీ సెట్ వేసి ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్ చేస్తున్నారు. ఈ షెడ్యూల్లో కొన్ని కీలక సన్నివేశాల్లో నటించేందుకు శ్రద్ధ హైదరాబాద్ వచ్చింది. సాహో టీంతో ఇట్టే కలిసిపోగలిగానని ఈ అందాల భామ ఆనందంగా చెబుతోంది. ఫస్ట్ షెడ్యూల్ లో తన పాత్ర షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సొగసరి తెలుగు పరిశ్రమ తనకు నచ్చిందని చెబుతోంది. ‘‘సాహో ఫస్ట్ షెడ్యూల్ పూర్తయింది. చక్కటి టీంతో టైం అద్భుతంగా గడిచిపోయింది. అన్నీ మంచి అనుభూతులే. హైదరాబాద్ లో ఉన్నన్నాళ్లు సొంతూళ్లో ఉన్నట్లే ఉంది’’ అంటూ ఫీలింగ్ ను షేర్ చేసుకుంది.

రన్ రాజా రన్ ఫేం సుజిత్ దర్శకత్వంలో తెలుగు - తమిళం - హిందీ భాషల్లో సాహో తెరకెక్కుతోంది. బాలీవుడ్ హీరో నీల్ నితిన్ ముఖేష్ ఇందులో విలన్ పాత్ర చేస్తున్నాడు

,  ,  ,  ,  ,