Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

03-Jun-2016 14:45:52
facebook Twitter Googleplus
Photo

నితిన్ అంటే లవర్ బోయ్. ఇప్పటివరకూ చేసిన సినిమాల్లో నితిన్ టార్గెట్ యూత్ ఆడియన్సే. అందుకే కుర్రాళ్లకు సినిమా నచ్చితే తప్పితే.. ఆడే పరిస్థితి లేదు. కానీ తన లవర్ బోయ్ ఇమేజ్ ను కాపాడుకుంటూనే.. ఫ్యామిలీ ఆడియన్స్ వైపు అడుగులు వేసే అరుదైన అవకాశం త్రివిక్రమ్ రూపంలో వచ్చింది. అందుకే అ..ఆ.. చిత్రంపై బోలెడన్ని ఆశలు పెట్టుకున్నాడు ఈ యంగ్ హీరో.

అయితే జోనర్ పరంగానే కాదు.. నితిన్ ని సేఫ్ జోన్ ఇప్పుడు చాలా అవసరం. వరుస ఫ్లాపుల తర్వాత ఫాంలోకి అయితే వచ్చాడు కానీ.. గుండె జారి గల్లంతయ్యిందే తర్వాత మళ్లీ ఆ రేంజ్ హిట్ కొట్టలేకపోయాడు. హార్ట్ ఎటాక్ - చిన్నదాన నీకోసం లాంటి వాటికి ఓపెనింగ్స్ వచ్చినా నిలబడలేదు. ఇక కొరియర్ బాయ్ కళ్యాణ్ పై అయితే.. మనోడికి ముందునుంచే నమ్మకం లేదు. అందుకే అ..ఆ.. చిత్రం తన రేంజ్ ని నిలబెట్టడంతో పాటు పెంచేస్తుందని నితిన్ చాలానే హోప్స్ పెట్టుకున్నాడు.

నితిన్ ఆశలు తీరడం అంత తేలికేం కాదు. ఎందుకంటే.. కనీసం 30 కోట్ల రూపాయలను థియేటర్ల నుంచి రాబడితే మాత్రమే.. అ.ఆ..ను హిట్ కేటగిరీలోకి చేర్చాలి. హీరోయిన్ సమంత - దర్శకుడు త్రివిక్రమ్ ఉన్నారు కాబట్టి.. ఇదేమీ అసాధ్యమైన టార్గెట్ కాదు. పైగా.. ఈ నెలలో వేరే ఏ భారీ చిత్రం రిలీజ్ లేకపోవడం నితిన్ కి బాగా ప్లస్ పాయింట్. ఇవన్నీ పాజిటివ్ అంశాలుగా మారిపోయి.. ఇప్పటికే వచ్చిన పాజిటివ్ టాక్ ని క్యాష్ చేసుకోగలిగితే.. నితిన్ కి కొత్త జోనర్ ఆడియన్స్ తోడయ్యి సేఫ్ జోన్ లోకి రావడానికి హెల్ప్ అవుతారు.

,  ,  ,  ,  ,  ,