Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

01-Oct-2016 15:26:31
facebook Twitter Googleplus
Photo

నటుడు నితిన్ హీరోగానే కాక డిస్ట్రిబ్యూటర్ గా కూడా సినిమా రంగంలో మంచి పేరు సంపాదించాడు. స్వతహాగా తండ్రి సుధాకర్ రెడ్డి నైజాం ఏరియాలో మంచి పేరున్న డిస్ట్రిబ్యూటర్ కావడంతో నితిన్ అదే బాటలో అడుగులు వేస్తున్నారు. తాజాగా ఆయన నందమూరి బాలకృష్ణ 100 చిత్రం ? గౌతమీపుత్ర శాతకర్ణి? యొక్క నైజాం డిస్ట్రిబ్యూషన్ హక్కులను భారీ మొత్తానికి సొంత చేసుకున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ ద్వారా తెలిపారు.
ఇక సినీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఈ హక్కులకు నితిన్ రూ. 10. 6 కోట్లు వెచ్చించారని అందులో రూ.1.6 కోట్లు రికవరబుల్ అమౌంట్ అని తెలుస్తోంది. ఇకపోతే ఈ చిత్రంలో శ్రియ శరన్ బాలయ్యకు జంటగా నటిస్తుండగా హేమమాలిని ఓ బాలకృష్ణ తల్లి పాత్రను పోషిస్తోంది. దర్శకుడు క్రిష్, రాజీవ్ రెడ్డిలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం సంక్రాంతికి విడుదలకానుంది.

,  ,  ,  ,  ,