Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

13-May-2017 10:29:47
facebook Twitter Googleplus
Photo

మలయాళీ భామ నిత్యా మీనన్ కు టాలీవుడ్ లో ఫుల్ డిమాండ్ ఉంటుంది. అయినా సరే జనతా గ్యారేజ్ తర్వాత ఇప్పటివరకూ ఒక్క సినిమా కూడా లేదు నిత్య. ఆ మూవీలో ఈమె బాడీ స్ట్రక్చర్ పై వచ్చిన విమర్శలే ఇందుకు కారణం అంటారు కొందరు. అయితే.. ఇప్పుడు నిత్యామీనన్ వరుసగా లేడీ ఓరియెంటెడ్ మూవీస్ తో దాడి చేయబోతోందని తెలుస్తోంది.

వీటిలో ఒకటి కన్నడలో సూపర్ హిట్ అయిన సస్పెన్స్ థ్రిల్లర్ యూ-టర్న్. నిజానికి యూ-టర్న్ మూవీ తెలుగులో చేయాలని సమంత చాలా ఉత్సాహం చూపింది. కొన్ని నెలల క్రితం చెయ్ తో కలిసి బెంగళూరు వెళ్లి మూవీ చూసి.. మేకర్స్ ని అభినందించింది కూడా. అయితే.. ఈ మూవీ తెలుగు వెర్షన్ లో సమంత చేయడం లేదని.. అందుకే మేకర్స్ నిత్యా మీనన్ ను అప్రోచ్ అయ్యారని తెలుస్తోంది. ఇప్పటికే నిత్యకు నెరేషన్ ఇవ్వడం.. ఆమె ఆసక్తి చూపడం కూడా జరిగిపోయాయి. ఒకసారి ఈ భామ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిందంటే ప్రాజెక్ట్ పట్టాలెక్కేసినట్లే.

మరోవైపు కే.ఎస్.రామారావు నిర్మాణంలో ఓ మహిళా ప్రాధాన్యత ఉన్న చిత్రంలో నటించనుంది నిత్యా మీనన్. గతంలో వీరిద్దరూ మళ్లీ మళ్లీ ఇది రాని రోజు కోసం కలిసి పని చేశారు

,  ,  ,  ,  ,  ,