Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

09-Jan-2017 12:28:05
facebook Twitter Googleplus
Photo

టాలీవుడ్ లో ప్రగ్యా జైస్వాల్ కెరీర్ సంథింగ్ డిఫరెంట్. మిర్చి లాంటి కుర్రాడు ఓ చిన్న సినిమాతో అరంగేట్రం చేసి.. ఆ తర్వాత కంచె మూవీతో గుర్తింపు పొందింది ఈ హాట్ పాప.. అయితే.. మొదటి సినిమా వదిలేసి.. తాను కంచెతోనే అరంగేట్రం చేశాను అన్నట్లుగా.. ఉత్తమ నూతన నటి అవార్డులను ఏ మాత్రం అభ్యంతరాలు చెప్పకుండా అందుకుంది కూడా. ప్రస్తుతం ఈ భామ నాగార్జున నటించిన భక్తిరస చిత్రం ఓం నమో వెంకటేశాయలో కీలక పాత్ర పోషించింది.

తాజాగా ఓం నమో వెంకటేశాయ ఆడియో ఫంక్షన్ ను గ్రాండ్ గా సెలబ్రేట్ చేశారు. భక్తి చిత్రం కావడంతో దాదాపు అందరూ పద్ధతిగా సాంప్రదాయ వస్త్రధారణలోనే కనిపించారు. కానీ కంచె బ్యూటీ ప్రగ్యా జైస్వాల్ మాత్రం.. సంప్రదాయపు కంచెలు తెంచేసినట్లుగా వచ్చేసింది. స్లీవ్ లెస్ టాప్.. నడుం చూపిస్తూ డ్రసింగ్.. నాభిని ఎక్స్ పోజ్ చూస్తూ బాటమ్.. ఇలా సెక్సీగా తయారయిపోయి వచ్చేసింది ప్రగ్యా జైస్వాల్.

సినిమాలో కూడా గ్లామర్ రోల్ నే చేసింది కానీ.. కనీసం ఆడియో వేడుకలో అయినా.. భక్తి ప్రపత్తుల్లో కాసిన్ని ప్రదర్శించి బాగుండేదనే కామెంట్స్ గట్టిగానే వినిపించాయి. అయితే.. అందరూ సంప్రదాయంగా కనిపించి.. ఈమె ఒక్కతి మోడ్రన్ వేర్ లో ఉండేసరికి.. ప్రగ్యా మీదే అందరి ఫోకస్ పడింది. ఓ రకంగా ఈ భామ టార్గెట్ రీచ్ అయినట్లే!

,  ,  ,  ,  ,