Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

09-Aug-2016 12:42:19
facebook Twitter Googleplus
Photo

సినిమాలు చేయడంలో నిత్యామీనన్ చాలా డిఫరెంట్. నటనకు ప్రాధన్యత వున్న పాత్రలకే సైన్ చేస్తుంది. కమర్షియల్ సినిమాల్లో ఎక్కువగా కనిపించకపోవడానికి ఇదీ ఓ కారణం. తెలుగు లో సనాఫ్ సత్యమూర్తి తప్పితే మరో బడా సినిమా లేదు నిత్యా కెరీర్ లో. ఇప్పుడు ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ లో ఓ హీరోయిన్ గా చేస్తోంది నిత్యా. ఈ సినిమా విషయంలో చాలా హ్యాపీ గా వుంది నిత్యా. ఈ సినిమా తన కోరిక తీరిందని చెబుతుందామె.

ఒక పెద్ద కమర్షియల్ సినిమాలో తన పాత్రకూ మంచి ప్రాధాన్యత వున్న సినిమా చేయాలన్నది నా కోరిక. ఆ కోరిక ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ తో తీరింది.ఈ సినిమాలో నా పాత్ర చాలా బాగా వచ్చింది. ఆ పాత్ర చేయడం చేయడం చాలా సంతోషాన్ని ఇచ్చింది. ఒక కమర్షియల్ సినిమాలో మంచి రోల్ చేయాలనేది నా కోరిక. ఆ కోరిక జనతా గ్యారేజ్ తో తీరిపోయింది. ఎన్టీఆర్-కొరటాల శివల టీం తో పనిచేయడం అమేజింగ్ ఎక్స్పీరియన్స్? అని చెప్పుకొచ్చింది నిత్యా.

భారీ అంచనాల నడుమ సెప్టెంబర్ 2న ఈ సినిమా ప్రేక్షకులముందు వస్తున్న సంగతి తెలిసిందే. అలాగే, ఈనెల 12న ఆడియో వేడుక జరుపుకోనుంది జనతా గ్యారేజ్

,  ,  ,  ,  ,  ,