Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

08-Jan-2016 17:41:38
facebook Twitter Googleplus
Photo

తన చుట్టూ అంతా పర్ఫెక్ట్ గా ఉండాలని అనుకుంటారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ప్రతీ చిన్న విషయాన్ని చాలా జాగ్రత్తగా పట్టి పట్టి చూడ్డం ఆయనకు అలవాటు. సిస్టం కూడా సరిగ్గా ఉండాలనే ఉద్దేశ్యంతోనే పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చానని ఆయనే చెప్పారు. కాకపోతే మనం ఇప్పుడు చెప్పుకునేది పొలిటికల్ సిస్టం గురించి కాదు లెండి.. ఇది సౌండ్ సిస్టం గురించిన కహానీ.

హైద్రాబాద్ లోని న్యూ ఎమ్మెల్యే కాలనీలో ఉన్న తన ఇంటినీ రీసెంట్ గా రీమోడలింగ్ చేయించారు పవర్ స్టార్. ఈ లగ్జరియస్ డూప్లెక్స్ అపార్ట్ మెంట్ ను అధునాతనంగా తీర్చిదిద్దారు. చిన్న విషయాల్లోనే క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ కాని పవన్.. తన ఇంటి విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవడం సహజం కదా. అలాగే తన ఇంటికి అమర్చుకునే సౌండ్ సిస్టం కూడా అత్యంత క్వాలిటీతో పాటు లేటెస్ట్ ది ఉండాలని భావించారు. అందుకే రీసెంట్ గా మాదాపూర్ లో మహావీర్ సౌండ్ విజన్ అనే సౌండింగ్ ఎక్స్ పర్ట్ జోన్ కి వెళ్లారాయన. లేటెస్ట్ ఎక్విప్ మెంట్ ఏం వచ్చిందో తెలుసుకుని ప్రతీ దాన్ని లైవ్ లో ఆపరేట్ చేయించి మరీ చూశారట.

అయితే.. ఇక్కడ ఏదైనా కొత్త ఎక్విప్ మెంట్ కి ఆర్డర్ ఇచ్చారో లేదో తెలీదు కానీ.. ఇప్పుడు అందుబాటులో ఉన్న టెక్నాలజీని గురించి తెలుసుకుని ఆశ్చర్యపోయారట. ఏమైనా.. జస్ట్ సౌండ్ సిస్టం విషయంలోనే ఇన్ని జాగ్రత్తలులు తీసుకుని ఇంతగా ఆలోచిస్తే.. మొత్తం వ్యవస్థ గురించి తను ఇంకెంత ఆలోచిస్తారో కదా!

,  ,  ,