Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

22-Jun-2016 11:58:15
facebook Twitter Googleplus
Photo

సౌత్ లో డేరింగ్ హీరోయిన్ పేరు చెప్పమంటే చాలామందికి మలయాళ కుట్టి నిత్యామీనన్ గుర్తుకొచ్చేస్తుంది. ఇందుకు కారణం.. తన రోల్ నచ్చితే ఎంత చిన్న పాత్ర అయినా.. లెంగ్త్ తో సంబంధం లేకుండానే యాక్సెప్ట్ చేసేస్తుంది. కేరక్టర్ ఎంత సేపు ఉంటుంది.. స్క్రీన్ ప్రెజెన్స్ సంగతేంటి.. లాంటివి పట్టించుకోకుండా తన ట్యాలెంట్ నే నమ్ముకుని జర్నీ చేసేస్తోంది నిత్య.

తనకు అంతటి పేరున్నా సెకండ్ హీరోయిన్ రోల్స్ లో కనిపించేందుకు ఏమాత్రం సంకోచించకపోవడం నిత్య ప్రత్యేకత. ప్రస్తుతం ఎన్టీఆర్ తో జనతా గ్యారేజ్ లోను.. కోలీవుడ్ లో విక్రమ్ కు జంటగా ఇరుమగన్ లోను.. కన్నడలో సుదీప్ కు జోడీగా ముడింజా ఇవనై పుడి లోను నటిస్తోంది నిత్యా మీనన్. అయితే.. ఈమె బిహేవియర్ చూసి చాలామంది తలపొగరు అనుకుంటూ ఉంటారు. ఆ విషయాన్ని తనే చెప్పింది కూడా. ఇది తనను బాధిస్తుందని.. అయితే తనకు స్ట్రయిట్ ఫార్వార్డ్ గా ఉండడమే ఇష్టమని చెప్పే నిత్యమకు. గతంలో ఓ లవ్ స్టోరీ కూడా ఉందట.

'కాలేజ్ రోజుల్లోనే ఓ వ్యక్తిని ప్రేమించాను. ఆ వ్యక్తితో జీవితం పంచుకోవాలనే ఉద్దేశ్యంతోనే ప్రేమించాను. అయితే.. కొంతకాలానికి అతనితో జీవితం నాకు సరిపడదనే విషయం అర్ధమైంది. అందుకే అతన్నుంచి విడిపోయాను' అంటూ తన బ్రేకప్ స్టోరీని నిర్మొహమాటంగా చెప్పేసింది నిత్యా మీనన్.

,  ,  ,  ,  ,  ,