Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

21-Apr-2015 10:15:12
facebook Twitter Googleplus
Photo

ఇప్పటికే 'ఏమిటో ఈ మాయ', 'మళ్లీ మళ్లీ ఇది రాని రోజు' సినిమాలలో జంటగా నటించిన శర్వానంద్, నిత్యామీనన్ మరోసారి హీరో హీరోయిన్లుగా నటించనున్నారు. 'బెంగళూర్ డేస్' తెలుగు రీమేక్ లో ఈ జంట ప్రేక్షకులకు మళ్లీ కనువిందు చేస్తారు. ఇందులో నిత్యాకు భర్తగా శర్వానంద్ కనిపిస్తాడు. మలయాళం మాతృకలో ఈ పాత్రలను నజ్రియా, ఫహాద్ ఫాజిల్ పోషించారు. 'ఓ మై ఫ్రెండ్' ఫేం వేణు శ్రీరాం దర్శకత్వం వహించే ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం జరుగుతున్నాయి. దిల్ రాజు దీనిని నిర్మిస్తున్నారు. కాగా, ఈ చిత్రం తమిళ వెర్షన్ షూటింగ్ ఇప్పటికే మొదలైంది.

,  ,  ,  ,  ,