Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

18-Jan-2017 10:44:07
facebook Twitter Googleplus
Photo

సింగర్ సునీత టాలీవుడ్ లో మోస్ట్ ఫేమస్. కేవలం గాయనిగానే కాకుండా.. టీవీ కార్యక్రమాలు హోస్ట్ చేయడంతోపాటు అనేక సినిమాలకు డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కూడా సునీతకు గుర్తింపు ఉంది. గులాబి మూవీలో ' ఈ వేళలో నీవు ఏం చేస్తు ఉంటావో' అంటూ మొదలుపెట్టి ఇప్పటివరకూ ఎన్నో సినిమాలకు పాటలు పాడిన సునీత.. వందలాది సినిమాలకు డబ్బింగ్ చెప్పింది.

అప్పట్లో సౌందర్య నుంచి.. ఇప్పుడు శ్రియవరకూ చాలామంది హీరోయిన్లకు తన గొంతు అరువు ఇచ్చింది సునీత. తాజాగా సంక్రాంతికి రిలీజ్ అయిన గౌతమిపుత్ర శాతకర్ణి.. బాలకృష్ణకు వందో చిత్రంగా ల్యాండ్ మార్క్ మూవీ కాగా.. ఇదే మూవీతో సునీత కూడా ఓ అరుదైన రికార్డ్ సొంతం చేసుకుంది. ఈ మూవీలో శ్రియకు డబ్బింగ్ చెప్పిన సునీతకు.. ఇది 750వ చిత్రం కావడం విశేషం.

'బాలకృష్ణ గారి వందో చిత్రం గౌతమిపుత్ర శాతకర్ణి నాకు కూడా ల్యాండ్ మార్క్ మూవీ కావడం చాలా సంతోషంగా ఉంది. ఈ మూవీ రిలీజ్ అయినప్పటి నుంచి ఎన్నో అభినందనలు అందుకుంటున్నాను. శ్రియకు నేను చెప్పిన డబ్బింగ్ చాలా వచ్చిందని అందరూ అంటున్నారు. క్రిష్ ప్రతిభా పాటవాలు.. శ్రియ ప్రదర్శించిన అద్భుతమైన నటన.. నాకు ఇంకా కష్టపడి డబ్బింగ్ చెప్పాలనే స్ఫూర్తిని ఇచ్చాయి' అని చెప్పింది సునీత.

,  ,  ,  ,  ,