Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

02-Aug-2016 14:50:38
facebook Twitter Googleplus
Photo

రక్ష సినిమాతో దర్శకుడిగా తన ప్రతిభ చూపి కమర్షియల్ హిట్ సాదించాలనే ఉద్దేశ్యంతో సునీల్ హీరోగా జక్కన్న సినిమాను తెరెకెక్కించాడు దర్శకుడు వంశీ కృష్ణ ఆకెళ్ళ. ఈ చిత్రం జూలై 29న ప్రేక్షకుల ముందుకొచ్చింది. మొదటి మిక్స్డ్ టాక్ తో బయలుదేరిన మెల్లగా కలెక్షన్లు పుంజుకుని జక్కన్న చిత్రం ముందుకెళుతోంది. ఈ సందర్బంగా దర్శకుడు ?వంశీ కృష్ణ ఆకెళ్ళ? తో జరిపిన ప్రత్యేక ఇంటర్వ్యూ విశేషాలు?
ప్రశ్న) సినిమాకి మిక్స్డ్ టాక్ వస్తుందని మీరు ముందు ఊహించారా ?
జ) లేదు. సినిమాకి మిక్స్డ్ టాక్ వస్తుందని అస్సలు అనుకోలేదు. ఖచ్చితంగా హిట్టవుతుందని అనుకున్నాను. మొదట అదే టాక్ వచ్చినా కూడా మెల్లగా సినిమా పుంజుకుంది. బి, సి సెంటర్ల ప్రేక్షకులు సినిమాకి బ్రహ్మరథం పడుతున్నారు. శుక్రవారం తరువాత శని, ఆదివారాలు సినిమా హౌస్ ఫుల్ అయింది. ఆ తరువాత వచ్చే కీలకమైన సోమవారం కూడా సినిమా వీకెండ్స్ రోజులకన్నా ఎక్కువ థియేటర్లలో హౌస్ ఫుల్ అయింది.
ప్రశ్న) మీ సినిమా కలెక్షన్లు ఎలా ఉన్నాయ్ ?
జ) కలెక్షన్లు చాలా బాగున్నాయ్. సినిమా బడ్జెట్ 12 కోట్లయితే ఇప్పటికే 80% అంటే 9 కోట్ల గ్రాస్ వచ్చేసింది. మిగిలిన డబ్బులు కూడా ఇంకో నాలుగైదు రోజుల్లో వచ్చేస్తాయి. సినిమా ఖచ్చితంగా సూపర్ హిట్. సునీల్ కెరీర్లో మర్యాద రామన్న, పూల రంగడు సినిమాల తరువాత ఇదే రికార్డ్ కలెక్షన్ల సినిమా.
ప్రశ్న) ఫ్యూచర్ లో ఇలాంటి మీడియం బడ్జెట్ సినిమాలే చేస్తారా లేకపోతే భారీ బడ్జెట్ చిత్రాలు చేస్తారా ?
జ) స్టార్ హీరోలతో అవకాశమొస్తే ఖచ్చితంగా భారీ బడ్జెట్ సినిమాలు చేస్తాను. అలాగని చిన్న సినిమాలు చేయకుండా ఉండను, కథను బట్టి చిన్న, పెద్ద సినిమాలు రెండూ చేస్తాను.
ప్రశ్న) పెళ్లి చూపులు సూపర్ హిట్ టాక్ తో నడుస్తుంది కదా అది జక్కన్నకు ఏమైనా నష్టం కలిగిస్తుందా ?
జ) లేదు. పెళ్లి చూపులు మంచి సినిమా. అది ?ఏ? సెంటర్ ఆడియన్సుకి నచ్చితే మాది ఫుల్ ఎంటర్టైనర్ ?బి, సి? సెంటర్ల ఆడియన్సును బాగా ఆకర్షిస్తోంది. మా సినిమాకు పెళ్లి చూపుల వల్ల ఎలాంటి నష్టమూ లేదు. అది వేరే జానర్, ఇది వేరే జానర్.
ప్రశ్న) సునీల్ గారితో జర్నీ ఎలా అనిపించింది ?
జ) సునీల్ గారు నాకు చాలా మంచి ఫ్రెండ్. ఆయనతో కలిసి పూలరంగడు సినిమాకి పని చేశాను. సెట్లో ఒక హీరోలా కాకుండా ఒక అసిస్టెంట్ డైరెక్టర్ అనుకుని సీన్ చెప్పమంటారు. ఆయనతో పనిచేయడం చాలా ఈజీగా ఉంటుంది. ఆయన సపోర్టుకి చాలా థ్యాంక్స్.
ప్రశ్న) ముందుగా ఈ కథ ముందుగా సునీల్ గారికే చెప్పలేదని విన్నాం ?
జ) అవును, మొదటి ఈ కథని ఇద్దరు ముగ్గురు వేరే హీరోలకి చెప్పా. కానీ ఎవరూ ఒప్పుకోలేదు. ఆ తరువాత దీనికి సునీల్ గారే కరెక్ట్ గా సరిపోతారని నమ్మి ఆయనకు చెప్పి ఆయన్ను ఒప్పించాను. ఈ సినిమాతో సునీల్ గారు ఇన్నాళ్లుగా ఎదురు చూస్తున్న హిట్ వచ్చినట్టే.
ప్రశ్న) ఈ సినిమా మీ కెరీర్ కు ఎలా ఉపయోగపడుతుంది ?
జ) నా మొదటి సినిమా ?రక్ష?. అది సపరేట్ జానర్ సినిమా. నేను కమర్షియల్ హిట్ కోసం ట్రై చేస్తూ ఈ సినిమా చేశా. ఈ విజయం ఖచ్చితంగా నా కెరీర్ ను ముందుకు తీసుకెళ్లి మంచి అవకాశాలు వచ్చేలా చేస్తుంది.
ప్రశ్న) మీ తరువాతి సినిమాల గురుంచి ఏమైనా చెబుతారా ?
జ) ప్రస్తుతానికి రెండు మూడు ప్రాజెక్టుల్ని అనుకొన్నాను. ఇంకా ఏదీ ఫైనల్ కాలేదు. నా తరువాతి సినిమా కూడా కంప్లీట్ ఎంటర్టైనర్ గా ఉంటుంది.

,  ,  ,  ,  ,