Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

20-Jan-2017 10:47:24
facebook Twitter Googleplus
Photo

మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ మూవీ ఖైదీ నెంబర్ 150 గురించి మాట్లాడుకునే వారిలో ఎక్కువమంది సినిమా గురించి స్క్రీన్ ప్లే గురించి కంటే కూడా ఆ సినిమాలో చిరంజీవి లుక్ గురించే మాట్లాడుకుంటున్నారంటే అతిశయోక్తి కాదు. సుమారు పదేళ్ల కిందట వచ్చిన సినిమాల్లో కంటే తాజా చిత్రంలో చిరు మరింత అందంగా కనిపించారంటుంటే... మరికొంతమందైతే... చూడాలని ఉంది సినిమాలో చిరంజీవిలా ఉన్నాడని కితాబిస్తున్నారు. అయితే ఈ కాంప్లిమెంట్స్ తో రెండు రకాల ఆనందాలను ఒకేసారి అనుభవిస్తుంది చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత.

ఖైదీ నెంబరు 150 సినిమా సక్సెస్ తో మెగాభిమానులతో పాటు మెగా ఫ్యామిలీ జనాల సంబరాలు అంబరాన్నంటిన సంగతి తెలిసిందే. తమ తండ్రి కం బ్యాక్ ఫిల్మ్ ఈ రేంజ్ లో దూసుకుపోవడంతో ఒకరకమైన ఆనందాన్ని అనుభవిస్తున్న సుస్మిత... చిరు స్టైలిష్ లుక్ గురించి వస్తున్న ప్రశంసలతో రెండో ఆనందాన్ని పొందుతుంది. అవును... ఖైదీ నెంబరు 150లో చిరు లుక్ కి వచ్చే ప్రతీ ప్రశంసలోనూ చిరు కూతురు సుష్మిత కు వాటా ఉంటుంది. ఎందుకంటే "ఖైదీ నెంబర్ 150"కి స్టైలిస్ట్ ఆమే మరి. ఈ సినిమాలో చిరు లుక్ పరంగా చిరంజీవితో పాటు ఒక స్టైలిస్ట్ గా తాను ఎంత కేర్ తీసుకున్నది సుష్మిత తాజాగా ఒక ఇంటర్వులో వివరించింది.

ఈ సినిమాలో చిరంజీవి అంత అందంగా కనిపించడంతో తనపాత్ర కంటే ముందు చిరు కష్టమే ఎక్కువని మొదలుపెట్టిన సుష్మిత... సినిమా కోసం ఆయన తన ఫిజిక్ ఎంతో మార్చుకున్నారని అన్నారు. ఆయనకున్న మంచి టేస్టు వల్ల ఏది సూటవుతుందో ఆయనకే బాగా తెలుసని.. ఇదే క్రమంలో తన తండ్రి ఇష్టాఇష్టాలేంటో తనకు కూడా బాగానే తెలుసని సుష్మిత అన్నారు. ఇక తాను స్టైలిస్ట్ గా చేయబోయే ఈ ఖైదీ నెంబర్ 150మొదలవడానికి ముందు తాను చరణ్ కలిసి చర్చించుకున్న అనంతరం ఈ నిర్ణయాలు తీసుకున్నామని చెప్పారు. ఈ సందర్భంలో చిరుని మరీ కుర్రాడిలా కాకుండా అలా అని మరీ పెద్దమనిషిలా కాకుండా ఒకవైపు ట్రైండీగా ఉంటూనే మరోవైపు పాత్రకు తగ్గట్లు చూపించాలని భావించామని తెలిపిన సుష్మిత... ఒకవైపు కత్తి శ్రీను పాత్ర కోసం మాస్ గా శంకర్ పాత్రకు తగ్గట్లుగా కాస్త క్లాస్ గా దుస్తులు సమకూర్చామని.. ఆ లుక్స్ పై ప్రస్తుతం వస్తున్న రెస్పాన్స్ తో తానెంతో హ్యాపీగా ఉన్నానని చెబుతుంది!!

,  ,  ,  ,