Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

19-Jun-2017 12:36:48
facebook Twitter Googleplus
Photo

జూనియర్ ఎన్టీఆర్ సిల్వర్ స్క్రీన్ స్టార్ హీరో. ఇప్పుడున్న స్టార్ హీరోల్లో అందరికంటే ముందు స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్న హీరో ఎన్టీఆర్ అనే సంగతి గుర్తుంచుకోవాలి. కొన్నేళ్లు ఇబ్బంది పడ్డా.. మళ్లీ ఇప్పుడు ఫుల్లు ఫాంలోకి వచ్చేసి.. సక్సెస్ లతో తెగ చెలరేగిపోతున్న జూనియర్.. బిగ్ బాస్ రియాల్టీ షో ద్వారా బుల్లితెర ప్రేక్షకులను కూడా అలరించబోతున్నాడు.

బిగ్ బాస్ షూటింగ్ కోసం వచ్చే నెలలో ముంబై వెళ్లనున్నాడు యంగ్ టైగర్. అక్కడి స్టూడియోలోనే అన్ని ఎపిసోడ్స్ షూటింగ్ జరగనుంది. పార్టిసిపెంట్స్ ఎవరనే విషయం ఇంకా చెప్పలేదు కానీ.. తాజాగా ఈ బిగ్ బాస్ తెలుగు వెర్షన్ కు సంబంధించిన టీజర్ రిలీజ్ చేశారు. ఇది చాలామందికి నచ్చేసింది కానీ.. ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రం తెగ గుస్సా అయిపోతున్నారట. అంతటి స్టైలిష్ గా ఉండి.. ఆడియన్స్ అందరూ మెచ్చుకున్న ట్రైలర్ పై.. ఫ్యాన్స్ సీరియస్ అవడానికి కారణం లేకపోలేదు. ఈ టీజర్ లో ఎన్టీఆర్ ను చూపిన విధానమే అభిమానుల ఆగ్రహానికి కారణంగా నిలుస్తోంది.

బిగ్ బాస్ టీజర్ లో ఎన్టీఆర్ జేమ్స్ బాండ్ తరహాలో కనిపిస్తాడు. అమ్మాయిలు తెగ మీదపడిపోతూ ఉంటారు. కానీ రియల్ లైఫ్ లో ఎన్టీఆర్ ఇలాంటి ప్లేబోయ్ టైపు కేరక్టర్ కాదు.

,  ,  ,  ,  ,