Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

19-May-2015 11:03:04
facebook Twitter Googleplus
Photo

సినిమా .. సినిమాకి యంగ్ ఎన్టీఆర్ లుక్ వేరుగా వుంటుంది .. ఆ సినిమాతో ఆయన అందించే కిక్ వేరుగా వుంటుంది. అలా కొత్తదనానికి ప్రాముఖ్యతనిస్తూ ఉంటాడనడానికి నిదర్శనమే నిన్న చేసిన 'టెంపర్' .. త్వరలో చేయనున్న 'మానాన్నకి ప్రేమతో'. ఇక తాను చేసే విభిన్నమైన పాత్రలను ఆదరించి .. తనకి విజయాలను అందించే అభిమానులను ఎన్టీఆర్ ఎంతమాత్రం మరిచిపోడు. వాళ్లకి సంతోషాన్ని కలిగించే నిర్ణయాలు తీసుకుంటూ తాను ఆనందాన్ని పొందుతుంటాడు.

అందులో భాగంగానే ఆయన ఈ పుట్టినరోజున ఒక కార్యక్రమాన్ని తలపెట్టినట్టు వార్తలు షికారు చేస్తున్నాయి. ఇటీవల ఎన్టీఆర్ కి వారసుడు జన్మించిన సంగతి తెలిసిందే. ఆ పిల్లవాడికి 'అభయ్ రామ్' అని నామకరణం చేశారు. అప్పటి నుంచి ఎన్టీఆర్ అభిమానులు అభయ్ రామ్ ఎలా ఉంటాడో చూడాలని ఆతృత పడుతున్నారు. అభిమానుల మనసు గ్రహించిన ఎన్టీఆర్, ఈ నెల 20న తన పుట్టినరోజు సందర్భంగా, తన వారసుడి ఫోటోలను మీడియాకి రిలీజ్ చేసే ఆలోచనలో వున్నట్లు తెలుస్తోంది. అదే నిజమైతే ఎన్టీఆర్ అభిమానుల ముచ్చట తీరినట్టేకదా!

,  ,  ,  ,