Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

21-Nov-2016 16:33:21
facebook Twitter Googleplus
Photo

ఇప్పటివరకు చాలా సైలెంటుగా పనికానిచ్చేశాడు మెగా హీరో రామ్ చరణ్. అసలు ధృవ సినిమా షూటింగ్ ఎప్పుడు ఎక్కడ జరుగుతుందో తెలియనంత గోప్యంగా పనులన్నీ ఫినిష్ చేశాడు. అయితే ఇప్పుడు అత్యంత బీభత్సమైన ట్విస్టు ఏంటంటే.. మూడు రోజుల క్రితమే షూటింగ్ మొత్తం పూర్తి చేసుకున్న ఈ సినిమా.. ఇప్పుడు ఏకంగా సెన్సార్ పనులు కూడా పూర్తి చేసుకుంది. అవును.. నిజమేనండోయ్!!

సోమవారం ఉదయం స్లాటులో సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న మెగా పవర్ స్టార్ సినిమా.. సెన్సార్ సభ్యుల ఎప్రీషియేషన్ తో పాటు.. యు/ఎ సర్టిఫికేట్ కూడా పొందేసింది. అసలు ఇలా షాకింగ్ రేంజులో రిలీజ్ కు దాదాపు 20 రోజుల మునుపే సెన్సార్ పనులు పూర్తి చేసుకుని సర్టిఫికేట్ చేతికి తెచ్చుకోవడం అంటే అది గీతా ఆర్ట్స్ వారికే చెల్లిందని చెప్పుకోవాలి. సినిమా ప్రథమార్దంలో కామెడీ పార్టు బాగా వర్కవుట్ అయితే.. సెకండాఫ్ లో స్టోరి ఎలిమెంట్స్ మైండ్ బ్లోయింగ్ అంటున్నారు. అలాగే చరణ్ అండ్ విలన్ అరవింద్ స్వామి మధ్య వచ్చే పతాక సన్నివేశాలన్నీ అదిరిపోయాయ్ అని టాక్ వినిపిస్తోంది.

మొత్తానికి సురేందర్ రెడ్డి డైరక్షన్లో రూపొందిన ''ధృవ'' సినిమా రిలీజ్ డిసెంబర్ 9న అన్ని విధాలుగా ఖాయం అనమాట. ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తుండగా.. నవదీప్ మరో ముఖ్యమైన పాత్రను పోషిస్తున్నాడు. సినిమాకు హిప్ హాప్ తమిజ (తమిళ) సంగీతాన్ని అందించాడులే.

,  ,  ,  ,  ,