Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

21-Apr-2016 12:14:17
facebook Twitter Googleplus
Photo

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా ప్రస్తుతం జనతా గ్యారెజ్ అనే ఓ పవర్ఫుల్ కమర్షియల్ ఎంటర్‌టైనర్ తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. శ్రీమంతుడు బ్లాక్‌బస్టర్‌తో టాప్ దర్శకుల జాబితాలో చేరిపోయిన కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా కావడంతో జనతా గ్యారెజ్ మొదట్నుంచీ ఆసక్తి రేకెత్తిస్తూ వస్తోంది. ఇక దానికితోడు మళయాల సూపర్ స్టార్ మోహన్ లాల్ ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తూండడం కూడా ఈ సినిమాకు హైప్ తెచ్చింది. ఇక ఇన్ని హంగులున్న ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్‌లుక్ రిలీజ్ గురించి ఓ సమాచారం అందుతోంది.
ఎన్టీఆర్ పుట్టినరోజైన మే 20న జనతా గ్యారెజ్ ఫస్ట్‌లుక్ విడుదల చేసే ఆలోచనలో టీమ్ ఉందని తెలుస్తోంది. ఎన్టీఆర్ పుట్టినరోజు కానుకగా అభిమానుల్లో ఉత్సాహం నింపేలా ఫస్ట్‌లుక్ విడుదల చేయడం బాగుంటుందని టీమ్ ఈ ఆలోచన చేసినట్లు సమాచారం. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోన్న ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన సమంత, నిత్యా మీనన్‌లు హీరోయిన్లుగా నటిస్తున్నారు.

,  ,  ,  ,  ,  ,