Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

11-Aug-2016 14:47:00
facebook Twitter Googleplus
Photo

టెంపర్ ముందువరకు కూడా ఎన్టీఆర్ కెరియర్ ఏమవుతుందో అని అందరూ భయపడ్డారు..కానీ పూరి దర్శకత్వం లో వచ్చిన టెంపర్ చిత్రం తో మళ్లీ తన సత్తా ఏంటో ఇండస్ట్రీ కి చూపించాడు. టెంపర్ , నాన్నకు ప్రేమతో ఇలా రెండు బ్లాక్ బస్టర్ హిట్స్ తో తన మార్కెట్ ను సైతం బాగా పెంచుకున్నాడు. ఈ సంగతి పక్కన పెడితే హిందీలో కూడా మన బుడ్డోడు దుమ్ములేపుతున్నాడు.

తెలుగు లో డిజాస్టర్ అయినా చిత్రాలన్నీ హిందీ లో డబ్ అయి అక్కడి బుల్లి తెర ఫై అత్యధిక టిఆర్పీ రేటింగ్ తో బాలీవుడ్ చిత్రాల రేటింగ్ లను దుమ్ముదులుపుతున్నాయి. దమ్ము , రభస చిత్రాలు ఇందుకు నిదర్శనం. దీంతో అక్కడ కూడా ఎన్టీఆర్ కు అభిమానులు బాగానే పెరిగిపోయారు. తాజాగా ఎన్టీఆర్ నటించిన జనతా గ్యారేజ్ ఫై వాళ్ళు కూడా అంచనాలు పెంచేసుకున్నాడు. డైరెక్ట్ గా థియేటర్స్ లలో చూడడానికి ఆసక్తి చూపిస్తున్నారు. మొత్తానికి ఎన్టీఆర్ తెలుగు , తమిళ్ , మలయాళం , ఇప్పుడు బాలీవుడ్ లోకూడా తన హావ కొనసాగిస్తున్నాడు అన్నమాట.

,  ,  ,  ,  ,