Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

24-Jun-2015 11:23:57
facebook Twitter Googleplus
Photo

ఎన్టీఆర్ .. సుకుమార్ కాంబినేషన్లోని సినిమా షూటింగ్ లండన్లో మొదలు కాబోతోంది. జూలై 1న మొదలయ్యే ఈ షెడ్యూల్ సెప్టెంబర్ 15 వరకూ అక్కడే జరగనుంది. అలా ఇక్కడ భారీ షెడ్యూలును ప్లాన్ చేశారు. ఎన్టీఆర్ కి సంబంధించిన యాక్షన్ ఎపిసోడ్స్ ను .. కథలో కీలకంగా అనిపించే కొన్ని సన్నివేశాలను .. పాటలను ఇక్కడ చిత్రీకరించనున్నారు.

భారీ బడ్జెట్ తో బీవీఎస్ ఎన్ ప్రసాద్ నిర్మిస్తోన్న ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ కథానాయికగా అలరించనుంది. లవ్ .. సెంటిమెంట్ .. యాక్షన్ .. కామెడీని సమపాళ్లలో కలిపి ఈ కథను సిద్ధం చేశారు. ఇక దేవిశ్రీ ప్రసాద్ సంగీతం .. ఎన్టీఆర్ డాన్సులు కట్టిపడేస్తాయని చెబుతున్నారు. అభిమానులు కోరుకునే అన్ని హంగులతో ఈ సినిమాను సంక్రాంతి కానుకగా అందించాలనే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది.

,  ,  ,  ,