Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

02-Aug-2017 10:31:12
facebook Twitter Googleplus
Photo

సినిమాలలో ఒక చిన్న హీరో సినిమా కోసం పెద్ద ప్రచారం జరుగుతోంది. సినిమా హీరో కొత్తవాడైనా ఆ సినిమాకు పని చేసే మిగతవారు మాత్రం పెద్ద స్టార్స్ అనే చెప్పాలి. దానితో ఇది ఆ హీరో సినిమా అని కాకుండా ఒక స్టార్ డైరెక్టర్ సినిమాగా మారిపోయింది. సినిమా ప్రచారం మొదలు పెట్టినప్పటి నుండి ఇది డైరెక్టర్ తీసిన కొత్త ప్రేమ కథ గానే ప్రచారం చేస్తున్నారు. బోయపాటి శ్రీను డైరెక్ట్ చేసిన జయ జానకి నాయక సినిమా ఆడియో ఫంక్షన్ నిన్న రాత్రి జరిగింది. ఆ ఫంక్షన్ లో జయ జానకి నాయక సినిమా యూనిట్ అంతా వచ్చి ఈవెంట్ ని విజయవంతం చేసారు. ఈ ఫంక్షన్ లో ముఖ్యంగా దేవి శ్రీ ప్రసంగం కొంచెం కొత్తగా ఉంది.

ఈ సినిమాకు మ్యూజిక్ అందించిన దేవి శ్రీ ప్రసాద్ సినిమా యూనిట్ గురించి మాట్లాడుతూ నాకు ఈ సినిమాలో బాగా నచ్చింది ఏంటంటే అది ఈ సినిమా టైటిల్ జయ జానకి నాయక. ఇది నేను బోయపాటి గారు కథ చెప్పినప్పుడే చెప్పాను ఆయనతో. బోయపాటి మొదటి సినిమాకు మ్యూజిక్ నేనే ఇచ్చాను. ఇప్పుడు ఇది నా నాలుగో సినిమా ఆయనతో. నాకు చాల సంతోషంగా ఉంది ఆయనతో పని చేయడం. బోయపాటి శ్రీను సినిమాలలో ఉండే యాక్షన్ ఎమోషన్ ఈ సినిమాలు ఉంటాయి దానితో పాటుగా ఈ సినిమాలో మరో కొత్తదనం ఉంది. అది ఏంటంటే ఆయన ఇంత వరకు ప్రేమ పై ఎక్కువ ఫోకస్ చేయలేదు. ఈ సినిమాలో అది చేశారు'' అంటూ బోయపాటిని ఆకాశానికి ఎత్తేశాడు.

అలాగే బెల్లంకొండ శ్రీనివాస్ గురించి కూడా చెప్పాడు. బెల్లంకొండ శ్రీనివాస్ మొదటి సినిమాకు నేనే సంగీతం ఇచ్చాను మళ్ళీ ఇది నా రెండో సినిమా శ్రీనివాస్ తో. తన మొదట సినిమా కు ఈ సినిమాకు తన బాడీ లోకాని యాక్టింగ్ లోకాని బాగా మార్పు వచ్చింది నేను అది రి రికార్డింగ్ చేస్తున్నప్పుడు చూశాను. ఇంకా ఈ సినిమాలో ముఖ్యంగా మరో ఇద్దరు హీరోలు గురించి చెప్పుకోవాలి. ఒకటి శరత్ కుమార్ గారు శరత్ కుమార్ గారిని నేను చెన్నై లో ఉన్నప్పటి నుండి చేస్తున్న ఆయానికి నేను పెద్ద అభిమాని. ఆయన ఫిట్నెస్ అంతే నాకు చాలా ఇష్టం. ఇంకా రెండోది జగపతి బాబు గురించి చెప్పాలి ఒక మనిషిలోని మంచి చూడాలి అంటే ముందు మనం మంచి వాళ్ళం కావాలి. జగపతి బాబు గారు ఎప్పుడు నన్ను కలిసిన నేను మంచి వాడిని అని చెబుతుంటారు కానీ నేను ఆయన అంత మంచి మనిషిని ఎక్కడ చూడలేదు అన్నాడు.

ఇలా పని చేసిన హీరోలు ని క్రియేటివ్ టీమ్ ని మరి ముఖ్యంగా తన మ్యూజిక్ డిపార్ట్మెంట్ ని తెగ పొగిడేశాడు.

,  ,  ,  ,  ,  ,