Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

14-Jul-2017 11:43:13
facebook Twitter Googleplus
Photo

పీఎస్వీ గరుడ వేగం 128 ఎ.ఎం బడ్జెట్ రూ.25 కోట్లని అంటే చాలామంది అది జోక్ అనుకున్నారు. కానీ తర్వాత ఆ చిత్ర నిర్మాత కోటేశ్వరరాజే స్వయంగా తమ సినిమా బడ్జెట్ పాతిక కోట్లని స్పష్టం చేశాడు. అయినా జనాలకు నమ్మకం కలగలేదు. తర్వాత రాజశేఖర్ కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించాడు. ఇప్పుడు ప్రవీణ్ సత్తారు కూడా మీడియాతో మాట్లాడుతూ ఈ చిత్ర బడ్జెట్ రూ.25 కోట్లన్న మాట వాస్తవమే అని తేల్చి చెప్పాడు. ఐతే అసలు రాజశేఖర్ ను హీరోగా పెట్టి ఏ ధైర్యంతో రూ.25 కోట్లు పెట్టారంటూ మొదట్నుంచి వ్యక్తమవుతున్న సందేహమే ఇప్పటికీ జనాల్ని వెంటాడుతోంది. అసలు వీళ్ల ధైర్యం ఏంటన్నదే అంతు బట్టడం లేదు.

మొన్నో ఇంటర్వ్యూలో మాట్లాడుతూ స్వయంగా రాజశేఖరే రూ.3-4 కోట్లకు తన మార్కెట్ లేకపోయినప్పటికీ.. గరుడవేగ మీద రూ.25 కోట్లు ఖర్చు పెడుతున్నారంటూ ఆశ్చర్యపోతూ మాట్లాడాడు. మరి అంత నిజాయితీగా తన మార్కెట్ పడిపోయిందని ఒప్పుకున్న రాజశేఖర్.. రూ.25 కోట్ల బడ్జెట్ అంటే ఎలా ఒప్పుకున్నాడో? నిర్మాత ఏ ధైర్యంతో అంత ఖర్చుకు ముందుకొచ్చాడో అన్నదే అర్థం కావడం లేదు. కథ మీద ఎంత నమ్మకమున్నప్పటికీ.. సినిమా ఎంత బాగా వచ్చినప్పటికీ.. రాజశేఖర్-ప్రవీణ్ సత్తారు కాంబినేషన్ ను చూసి బయ్యర్లు ఎగబడే పరిస్థితి అయితే లేదు. ప్రేక్షకులు కూడా ఏమాత్రం ఈ సినిమాపై ఆసక్తిని ప్రదర్శిస్తారన్నదీ సందేహమే. ఈ కాంబోను చూపించి.. సినిమాను బిజినెస్ చేసుకోవడమైతే కష్టమే. సినిమా హిట్ టాక్ తెచ్చుకున్నా సరే.. రూ.25 కోట్ల షేర్ రాబట్టడం అన్నది అసాధ్యంగానే కనిపిస్తోంది. అయినా ఈ చిత్ర బృందం అంత రిస్క్ చేయడానికి ఎలా సిద్ధపడిందో మరి? ఇంతకీ వాళ్ల కాన్ఫిడెన్స్ ఏంటో

,  ,  ,  ,  ,