Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

19-Nov-2016 13:05:58
facebook Twitter Googleplus
Photo

జనతా గ్యారేజ్ తో ఇండస్ట్రీ హిట్ కొట్టిన ఎన్టీఆర్.. తన నెక్ట్స్ మూవీ విషయంలో ఓ క్లారిటీ వచ్చేశాడట. స్టార్ డైరక్టర్లతోపాటు.. యంగ్ దర్శకులతో కూడా వరుసగా చర్చలు చేసిన ఎన్టీఆర్.. త్వరలో తన నెక్ట్స్ ప్రాజెక్ట్ ప్రటించేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.

గత కొన్ని రోజులుగా వివి వినాయక్ తో చర్చలు చేస్తూనే ఉన్నాడు ఎన్టీఆర్. రీసెంట్ గా వీళ్లద్దరూ టాప్ సీక్రెట్ గా కలుసున్నట్లుగా తెలుస్తోంది. ఓ ప్రైవేటు మీటింగ్ లో కొత్త ప్రాజెక్టును ఫైనల్ చేశాడట. ఇన్నాళ్లూ అనుకున్నట్లుగా ఇది అదుర్స్ మూవీకి సీక్వెల్ కాదని అంటున్నారు. ఓ ఫ్రెష్ సబ్జెక్ట్ పైనే వీరిద్దరూ వర్క్ చేస్తున్నారట. లైన్ ఓకే అయిందని.. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవితో ఖైదీ నెంబర్ 150 చేస్తున్న వివి వినాయక్.. తన టీంకు ఇప్పటికే ఎన్టీఆర్ సినిమాపై వర్క్ చేయమని సూచనలు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఏదేమైనా కూడా ఈ ప్రైవేట్ మీటింగ్ తాలూకు డిటైల్స్ మనకు త్వరలోనే తెలుస్తాయి.

జనతా గ్యారేజ్ తర్వాత తన మూవీని అనౌన్స్ చేయాలని ఉత్సాహంగానే ఉన్నాడట ఎన్టీఆర్. ఇప్పటికే పలు రూమర్స్ వస్తుండడంతో..వీటిని చెక్ పెట్టేందుకైనా కొత్త ప్రాజెక్ట్ ను ప్రకటించాలని అనుకుంటున్నాడట. కచ్చితంగా స్టార్ డైరెక్టర్ తోనే సినిమాల చేయాలన్న ఆలోచనే వినాయక్ తో మూవీకి మొగ్గడానికి కారణంగా తెలుస్తోంది.

,  ,  ,  ,  ,