Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

10-Jun-2016 16:27:04
facebook Twitter Googleplus
Photo

యాభయ్యేడో పుట్టిన రోజు జరుపుకొంటున్న నందమూరి నటసింహం బాలకృష్ణకు కుటుంబసభ్యులంతా పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పారు. కొందరు వ్యక్తిగతంగా - ఇంకొందరు ఫోన్లలో చెప్పగా.. అది చాలదన్నట్లుగా సోషల్ మీడియా వేదికగానూ బాలయ్యకు జన్మదిన శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. పెద్ద అల్లుడు నారా లోకేశ్ తాను మామయ్య బాలయ్యకు కేకు తినిపిస్తున్నట్లుగా ఉన్న చిత్రాన్ని సోషల్ మీడియాలో పోస్టు చేశారు. చిత్రంతో పాటు బాలయ్యకు పుట్టిన రోజు శుభాకాంక్షలూ తెలిపారు. ?? హ్యాపీ బర్త్ డే టు వర్సటైల్ ఆర్టిస్ట్ అండ్ లవింగ్ ఫాదర్.. అవర్ డియర్ లెజెండ్ బాలయ్య మావయ్య?? అంటూ లోకేశ్ తన అభినందనలు తెలిపారు.

ఏపీ సీఎం - బాలయ్య వియ్యంకుడు - బావ అయిన చంద్రబాబు కూడా సోషల్ మీడియా వేదికగా బాలయ్యకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయన తనదైన శైలిలో పెద్దరికంగా తన అభిమానాన్ని - ఆశీస్సులను అందించారు. ??వార్మ్ గ్రీటింగ్సు టు నందమూరి బాలకృష్ణ గారు ఆన్ హిజ్ బర్త్ డే?? అంటూ మొదలుపెట్టి నిండు నూరేళ్లు - ఆనందంగా - ఆరోగ్యంగా సుఖసంపదలతో జీవించాలని ఆకాంక్షించారు.

ఇక హరికృష్ణ తనయుడు కల్యాన్ రాం కూడా బాలయ్యకు అభినందనలు తెలిపారు. హ్యాపీ బర్త్ డే బాబాయి అంటూ ఆయన తన సందేశం రాశారు. అయితే.. నందమూరి కుటుంబానికి చెందిన మరో అగ్రహీరో జూనియర్ ఎన్టీఆర్ నుంచి మాత్రం బాలయ్యకు శుభాకాంక్షలు అందినట్లుగా లేవు. సోషల్ మీడియాలో శుభాకాంక్షలు చెప్పని జూనియర్ వ్యక్తిగతంగా కానీ ఫోన్లో కానీ చెప్పారేమో అన్నది ఎవరికీ తెలియదు. అయితే.. కొద్దికాలంగా జూనియర్ కు.. మిగతా నందమూరి కుటుంబానికి మధ్య ఉన్న సంబంధాల గురించి తెలిసిన వారు మాత్రం ఆయన్నుంచి బాలయ్యకు శుభాకాంక్షలు అందకపోయి ఉండవచ్చని అంటున్నారు.

,  ,  ,  ,  ,  ,  ,