Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

30-Jul-2016 10:54:16
facebook Twitter Googleplus
Photo

విక్టరీ వెంకటేష్, క్రేజీ తార నయనతార జంటగా నటించిన తాజా టాలీవుడ్ చిత్రం బాబు బంగారం. ఈ చిత్రం సెల్వి పేరుతో కోలీవుడ్‌కు రానుంది. వెంకటేశ్, నయనతారలది హిట్ ఫెయిర్ అని చెప్పవచ్చు. ఇంతకు ముందు లక్ష్మీ,తులసి వంటి విజయవంతమైన తెలుగు చిత్రాలలో ఈ జంట నటించి ప్రేక్షకుల్ని అలరించారు. తాజాగా బాబు బంగారం చిత్రంలో నటించారు. వరుస హిట్ చిత్రాల దర్శకుడు మారుతీ దర్శకత్వం వహించిన చిత్రం ఇది. చాలా కాలం తరువాత వెంకటేష్ పవర్‌ఫుల్ పోలీస్ అధికారిగా నటించిన చిత్రం బాబు బంగారం. ఫ్యామిలీ, కామెడీ, యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రానికి కమలహాసన్ నటించిన ఉత్తమ విలన్, విశ్వరూపం-2, తూంగావనం చిత్రాల ఫేమ్ జిబ్రాన్ సంగీతాన్ని అందించడం విశేషం.

ఈ చిత్రాన్ని ఇంతకు ముందు సెల్వందన్, ప్రభాస్ బాహుబలి, ఇదు దాండా పోలీస్, మగధీర, బ్రూస్‌లీ, ఎవండా వంటి విజయవంతమైన చిత్రాలను తమిళ ప్రేక్షకులకు అందించిన భద్రకాళీ ఫిలింస్ భద్రకాళీ ప్రసాద్ సెల్వి పేరుతో తమిళంలోకి అనువదిస్తున్నారు. స్వాతి, వర్షిణిల సితార ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ సమర్పణలో సత్య శీతల, అడ్డాల వెంకట్రావులు సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో ఆగస్ట్ 12న విడుదల కానుంది. కాగా తమిళ వెర్షన్ ఆడియో ఆవిష్కరణను త్వరలో నిర్వహించనున్నట్లు నిర్మాతలు వెల్లడించారు. ఆ కార్యక్రమానికి కథానాయకుడు వెంకటేష్‌తో పాటు చిత్ర యూనిట్ పాల్గొననున్నారని తెలిపారు.

,  ,  ,  ,  ,  ,