Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

27-Apr-2016 11:45:22
facebook Twitter Googleplus
Photo

క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణ వంశీ అనేక ప్రాజెక్టులపై గందరగోళంలో పడిపోయి ఎట్టకేలకు ఓ సినిమాని స్టార్ట్ చేశాడు. రామ్ చరణ్ తో గోవిందుడు అందరివాడేలే చిత్రంతో.. తనలో హిట్ కొట్టే సత్తా ఇంకా ఉందని ప్రూవ్ చేసుకున్న కృష్ణ వంశీ.. తర్వాత చాలానే ప్రాజెక్టులు అనుకున్నాడు ఈ డైరెక్టర్.

మొదట దిల్ రాజు నిర్మాణంలో రుద్రాక్షను ప్లాన్ చేశాడు. ఆ తర్వాత బాలయ్య వందో సినిమాకి ఓ స్టోరీ లైన్ వినిపించి.. రుద్రాక్షను పక్కన పెట్టేశాడు. తీరా బాలయ్య సెంచరీ మూవీ క్రిష్ చేతికి వెళ్లిపోవడం రుద్రాక్ష విషయంలో దిల్ రాజు కూడా వెనక్కి తగ్గాడంతో.. కృష్ణవంశీ పరిస్థితి కన్ఫ్యూజన్ లో పడిపోయింది.

ఇప్పుడు కృష్ణవంశీ ఏం చేస్తాడా అని ఇండస్ట్రీ అనుకుంటున్న టైంలో.. యంగ్ హీరో సందీప్ కిషన్ కొత్త సంగతులు చెప్పాడు. 'ఎన్నేళ్లుగానో కన్న కలలు నిజమయ్యాయి. నా ఫ్యావరేట్ డైరెక్టర్ కృష్ణవంశీతో జట్టు కట్టినందుకు హ్యాపీగా ఫీలవుతున్నా. నక్షత్రం అనే టైటిల్ తో తీయబోతున్న చిత్రానికి ముహూర్తం షాట్ తీశాం' అంటూ ట్వీట్ చేశాడు సందీప్ కిషన్.

సందీప్ ట్వీట్ ప్రకారం.. ఇప్పుడు కృష్ణవంశీ నక్షత్రం అనే టైటిల్ పై సినిమా చేస్తున్నాడని అర్ధమవుతోంది. ఇప్పటికే ముహూర్తం షాట్ కూడా తీసేయడంతో.. ఇక ప్రాజెక్టు పట్టాలెక్కినట్లే. మిగిలిన డీటైల్స్ ను త్వరలో అనౌన్స్ చేసే అవకాశాలున్నాయి.

,  ,  ,  ,  ,  ,  ,  ,