Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

24-Oct-2015 14:13:11
facebook Twitter Googleplus
Photo

నందమూరి ఫ్యాన్స్ దసరా పండుగతోపాటే మరిన్ని కూడా ఫెస్టివల్స్ కూడా వచ్చాయి. జూనియర్ ఎన్టీఆర్ సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న నాన్నకు ప్రేమతో చిత్రానికి ఫస్ట్ టీజర్ రిలీజ్ అయింది. స్టయిలిష్ లుక్ తో అదరగొట్టేసిన యంగ్ టైగర్ ని చూసి ఫ్యాన్స్ పండగ చేసేసుకున్నారు. పండగ తర్వాత బాబాయ్ బాలకృష్ణ కూడా తన 99వ మూవీ డిక్టేటర్ కి టీజర్ విడుదల చేశాడు. అబ్బాయ్ లుక్స్ తో ఇరగదీస్తే... బాబాయ్ పవర్ ఫుల్ డైలాగ్స్ తో అదరగొట్టేశాడు.

ఒకేసారి టీజర్స్ ఇవ్వడం బాగానే ఉంది. వీళ్లిద్దరూ ఒకేసారి సినిమాలు రిలీజ్ చేస్తాననడం మాత్రం ఫ్యాన్స్ ని టెన్షన్ పెడుతోంది. సంక్రాంతి పండక్కి రావడం ఖాయమని తేల్చేశాడు బాలకృష్ణ. ఇదే సీజన్ కి వస్తానని ముందే చెప్పాడు ఎన్టీఆర్. దీంతో అభిమానుల్లో టెన్షన్ మొదలైంది. రెండూ పెద్ద సినిమాలే కావడంతో కనీసం రెండు వారాలు గ్యాప్ లేకపోతే రెండు సినిమాలకూ కలెక్షన్స్ కు దెబ్బ పడుతుంది. అందులోనూ ఇద్దరూ నందమూరి హీరోలు కావడంతో ఆ ప్రభావం మరింతగా ఉంటుంది. అందుకే ఎవరో ఒకరు పోస్ట్ పోన్ చేసుకోవాలని కోరుతున్నారు అభిమానులు. కానీ బాలయ్య మాత్రం అనుకున్న డేట్ కి వచ్చి తీరతానని భీష్మించుకున్నాడని టాక్.

సంక్రాంతి హీరోగా బాలయ్యకు మంచి ట్రాక్ రికార్డ్ ఉంది. అందుకే బాలయ్య పట్టు. అయితే.. ఎన్టీఆర్ మాత్రం విడుదల విషయంలో వెనక్కి తగ్గేందుకు సిద్ధంగానే ఉన్నా.. బాబాయ్ అడిగితేనే అంటున్నాడట. ఒకవేళ గ్యాప్ మెయింటెయిన్ చేయాలని బాలకృష్ణ నుంచి డైరెక్ట్ గా రిక్వెస్ట్ గానీ సూచన కానీ వస్తే.. పోస్ట్ పోన్ చేసేందుకు రెడీ అంటున్నాడట. అవసరమైతే ముందే రిలీజ్ చేయాలని కూడా భావిస్తున్నాడట. అయితే ఇంకా ఏదీ ఫైనల్ కాకపోవడంతో. ఫ్యాన్స్ ఆతృతతో ఎదురుచూస్తున్నారు.

,  ,  ,  ,