Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

04-Jul-2016 11:37:10
facebook Twitter Googleplus
Photo

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తోన్న ?జనతా గ్యారెజ్? సినిమాపై అభిమానుల్లో ఇప్పట్నుంచే ఏ స్థాయిలో అంచనాలున్నాయో ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. ఈమధ్యే విడుదలైన ఫస్ట్‌లుక్‌తో అభిమానులంతా సినిమాపై అంచనాలను పెంచేసుకుంటూ వెళుతున్నారు. ఇక ఈ నేపథ్యంలోనే అభిమానుల్లో మరింత ఉత్సాహాన్ని నింపేలా ఈనెల 6న ఓ టీజర్‌ను విడుదల చేయనున్నట్లు ప్రకటించిన టీమ్, ఆ టీజర్‌తో ఫ్యాన్స్‌కు ట్రీట్ ఇచ్చేందుకు సిద్ధమైంది.
ఎన్టీఆర్ ఇప్పటికే టీజర్‌కి సంబంధించిన డబ్బింగ్ పనులన్నీ పూర్తి చేసేశారు. ఎన్టీఆర్ డైలాగ్స్ ఈ టీజర్‌కు హైలైట్‌గా నిలవనున్నాయని సమాచారం. ?మిర్చి?, ?శ్రీమంతుడు? లాంటి బ్లాక్‌బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించిన ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. మళయాల సూపర్ స్టార్ మోహన్ లాల్ ఓ ప్రధాన పాత్రలో నటిస్తోన్న ఈ సినిమాలో సమంత, నిత్యా మీనన్‌లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ చివరిదశలో ఉన్న ఈ సినిమా ఆగష్టు 12న విడుదల కానుంది.

,  ,  ,  ,  ,  ,  ,