Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

01-Sep-2016 11:30:34
facebook Twitter Googleplus
Photo

ఎన్టీఆర్ తో మొదటి సినిమా చేసి దర్శకుడిగా పరిచయమవాలని రచయిత వక్కంతం వంశీ గత కొన్నేళ్లుగా ఎన్టీఆర్ తో ట్రావెల్ అవుతూ వస్తున్నాడు. నటుడిగా తన ఇమేజ్ ను పెంచిన ?టెంపర్? సినిమాకు రచయితగా గొప్ప సహకారం అందించడం వలన ఎన్టీఆర్ కూడా వక్కంతం వంశీతో సినిమాకి సుముఖంగానే ఉన్నట్టు ?జనతా గ్యారేజ్? ఆడియోలో ప్రకటించాడు. ఆ తరువాత వీళ్ళ ప్రాజెక్టుకు ?దడ్కన్? అనే టైటిల్ ను కూడా ఫైనల్ చేశారని వార్తలొచ్చాయి.
కానీ తాజాగా మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మీ తరువాతి సినిమా ఎవరితో అనే ప్రశ్న రాగానే ఎన్టీఆర్ కాసేపు ఆలోచించి ముందు ఈ సినిమా విడుదలయ్యాక తరువాతి ప్రాజెక్ట్ ఎవరితో అనేది చెప్తానని సమాధానమిచ్చారే గాని వంశీతోనే అని మాత్రం చెప్పలేదు. ఒకవేళ సినిమా కన్ఫర్మ్ అయితే నెక్స్ట్ వంశీతోనే చేస్తానని, పలానా కథని ఏదో ఒక వివరం చెప్పుండేవారు. దీన్నిబట్టి ఎన్టీఆర్ వంశీకి ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదనే అనుకోవాలి మరి

,  ,  ,  ,  ,