Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

27-Aug-2015 16:37:41
facebook Twitter Googleplus
Photo

80ల్లో తెలుగు తెరను రంగులమయం చేసి.. మన ప్రేక్షకుల్ని ఉర్రూతలూగించిన సినిమాల్లో ?లేడీస్ టైలర్? ఒకటి. రాజేంద్ర ప్రసాద్ ను కామెడీ హీరోగా నిలబెట్టడమే కాదు.. వంశీని డైరెక్టర్ ను మరో స్థాయికి తీసుకెళ్లిన సినిమా ఇది. ఇప్పటి ప్రేక్షకులకు కూడా కనెక్టయ్యే అద్భుతమైన కామెడీతో ఆ సినిమాను తీర్చిదిద్దాడు వంశీ. మచ్చ ఉన్న అమ్మాయి కోసం జమజచ్చ జమజచ్చ అంటూ రాజేంద్రుడు చేసిన అల్లరి.. నల్లనమ్మ అర్చన అందం.. బట్టల సత్యంగా మల్లికార్జున రావు పండించిన అద్భుతమైన కామెడీ.. ప్రదీప్ శక్తి విలనీ.. తనికెళ్ల భరణి రచనా ప్రతిభ.. వంశీ టిపికల్ డైరెక్షన్.. అన్నీ కలిసి ?లేడీస్ టైలర్?ను ఓ క్లాసిక్ గా నిలబట్టాయి. ఇప్పుడు చూసినా రిఫ్రెషింగ్ గా అనిపించే సినిమా అది.

ఈ లేడీస్ టైలర్ కు సీక్వెల్ తీస్తానని ఎప్పట్నుంచో చెబుతున్నాడు వంశీ. రవితేజతో ?ఔను వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు? తీసినప్పటి నుంచి అతడితోనే ?ఫ్యాషన్ డిజైనర్ సన్నాఫ్ లేడీస్ టైలర్? సినిమా ఉంటుందని అంటున్నాడు వంశీ. కానీ వంశీ సినిమా సినిమాకు కింద పడ్డం.. రవితేజ అలా అలా ఎదిగిపోవడంతో ఈ కాంబినేషన్ సెట్టవ్వలేదు. ఈ మధ్య వంశీ సినిమాలు విడుదలవడమే గగనమయ్యే పరిస్థితి వచ్చేసింది. అయినప్పటికీ ఆయన ప్రయత్నం మానుకోలేదు. ఫ్యాషన్ డిజైనర్ ప్రాజెక్టును పక్కనబెట్టేయకుండా అదిరిపోయే కాంబినేషన్ సెట్ చేశాడు. లేడీస్ టైలర్ కు కథ మాటలు అందించిన తనికెళ్ల భరణే సీక్వెల్ కు కూడా కథ అందించారట. మధుర శ్రీధర్ ఈ సినిమాకు నిర్మాణ సారథిగా వ్యవహరిస్తారట. ప్రస్తుతం వంశీ ఏకాంతంగా గడుపుతూ స్క్రిప్టును పూర్తి స్థాయిలో తీర్చిదిద్దే పనిలో ఉన్నాడు. ఇంతకీ ఫ్యాషన్ డిజైనర్ గా కనిపించబోయే హీరో ఎవరో తెలుసా.. ఉయ్యాల జంపాల సినిమా చూపిస్త మావ ఫేమ్ రాజ్ తరుణ్. గోదావరి యాసలో పండిపోయిన రాజ్ తరుణ్ కంటే లేడీస్ టైలర్ సీక్వెల్ మంచి ఛాయిస్ ఎవరుంటారు చెప్పండి. వంశీ సెలక్షన్ అదిరిపోలా!

,  ,  ,  ,